Suriya: పుత్రోత్సాహంలో హీరో సూర్య.. ఏమైందంటే?

Suriya: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూర్య జ్యోతిక ఇద్దరు కూడా కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక సూర్య దంపతులు కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే తాజాగా తన కుమారుడు దేవ్ సాధించిన ఘనత పట్ల సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన కుమారుడు దేవ్ కరాటే నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ సాధించారు. అయితే ఈ బ్లాక్ బెల్ట్ అందించే కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమారుడు సాధించిన ఘనత చూసి ఈయన పుత్రోత్సాహంతో ఉన్నారు.

బ్లాక్ బెల్ట్..
తన కొడుకు వేదిక పైకి రాగానే తనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కొడుకు వేదిక దిగి వెళుతుండగా సూర్య మాత్రం సంతోషంతో తదేకంగా తన కొడుకు వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో తన కొడుకు సాధించిన ఘనత పట్ల సూర్య ఓ తండ్రిగా సంతోషం వ్యక్తం చేయడంతో ఆ సంతోషం తన కళ్ళల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.