Pawan Kalyan: మా అన్న జోలికి వస్తే అసలు సహించను.. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్!

Pawan Kalyan: ఇటీవల నటుడు మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో పట్ల వైసిపి ప్రధానం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి కూటమికి మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇలా పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు తెలుపుతున్నారనే విషయం గ్రహించే అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. ఇలాంటి తరుణంలోనే సజ్జల చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా చిరంజీవి పట్ల సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు.

డబ్బు అధికారం ఎక్కువయ్యాయి..
రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి సింహం కాదని గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేమంతా కూటమిగా ఏర్పడినది స్వలాభం కోసం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డామంటే ఈ సందర్భంగా వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.