Sonu Sood : చెత్త పాత్రలు చేయకుండా సౌత్ సినిమాలు నన్ను బ్రతికించాయి.. : సోనూసూద్

Sonu Sood : సోనూసూద్ సూపర్ సినిమాతో పరిచయమైనా అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత చాలా సినిమాల్లో విలన్ గా మెప్పించాడు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా మందికి సహాయం చేసి సోనూ సూద్ రియల్ హీరో అయ్యాడు. నిజానికి సినిమాల్లో విలన్ అయినా, నిజ జీవితంలో మాత్రం హీరో అయ్యాడు. అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న సోనూ సూద్ తాజాగా బాలీవుడ్ సినిమాలపై చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ సినిమాలనుండి సౌత్ సినిమాలు నన్ను కాపాడాయి….

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పాజిటివ్ పాత్రలు చేయాలని అనుకున్నా బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావడంవల్ల నెగెటివ్ పాత్రలే దొరికాయని చెప్పారు. దక్షిణాదిన చాలా సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని ఒక రకంగా బాలీవుడ్ లో చెత్త పాత్రలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీ నన్ను కాపాడిందని ఒకానొక దశలో బాలీవుడ్ వదిలేసి కేవలం సౌత్ సినిమాలను మాత్రమే చేసానని బాలీవుడ్ పై ఘాటు విమర్శలు చేసారు. సోనూసూద్ ఇటీవల చిరంజీవి ఆచార్య సినిమాలో విలన్ గా నటించారు. ఇక తాజాగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా పృథ్వీ రాజ్ సినిమాలో చంద్ బర్ధాయ్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా జూన్ 3న విడుదల కాబోతోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బాలీవుడ్ పై పలు ఆసక్తికర వాఖ్యలు చేసారు సోనూసూద్. ఇక బాలీవుడ్ ఈ వాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ప్రస్తుతం ప్రేక్షకులకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఓ సినిమా నచ్చకపోతే మరో సినిమాకి మారిపోవచ్చు. ప్రేక్షకులు బాగున్న చిత్రాలనే చూస్తారని చెప్పారు. బాగున్న సినిమాలు దక్షిణాదిలో చాలా వస్తున్నాయని సోనూసూద్‌ అన్నారు. ప్రస్తుతం సోనూసూద్ తమిళం, హిందీ సినిమాల్లో చేస్తున్నారు. ‘తమిళరసన్’, ‘ఫతే’ చిత్రాల్లో నటిస్తున్నారు.