Sreemukhi: కడుపుకి అన్నం తింటున్నావా…. శ్రీముఖి పై నేటిజన్స్ కామెంట్స్ ఏమైందంటే?

Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న శ్రీముఖి మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలా పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ అందాల విందును వడ్డిస్తున్న శ్రీముఖి కొన్నిసార్లు చీర ధరించి చాలా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తున్నారు.ఇలా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె తాజాగా శారీలో సింపుల్ గా క్యూట్ గా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

చాలా సింపుల్ గా సిల్క్ శారీలో.. ఫుల్ హ్యాండ్స్ తో పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని సింపుల్ ట్రెడిషనల్ లుక్స్ లో మెరిసింది . అంతేకాదు చూడడానికి చాలా హాట్ గా ఉన్నావంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈ ఫోటోపై స్పందిస్తూ శ్రీముఖి నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా ఇంత అందం ఎలా సాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Sreemukhi:అందంతో చంపేస్తున్న శ్రీముఖి…

ఇలా తన గ్లామర్ లుక్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు.