Movie News

Shivathmika: ఆ సినిమాలు ఎవరు చూడరు చేయొద్దని సలహా ఇచ్చారు… శివాత్మిక కామెంట్స్ వైరల్!

Shivathmika: సీనియర్ నటీనటులు జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాత్మిక అనంతరం పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందడం కోసం కష్టపడుతున్నారు.ఇలా దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివాత్మిక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ…ఇందులో తాను నటుడు ప్రకాష్ రాజ్ కుమార్తె పాత్రలో నటించానని తెలిపారు. అయితే ఇలా కూతురి పాత్రలో నటిస్తున్నానని తెలియగానే చాలామంది నాకు ఈ సినిమాలో నటించకు అంటూ సలహా ఇచ్చారని తెలిపారు.

ఇలా హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే ఇకపై హీరోయిన్ గా అవకాశాలు రావని ఇలాంటి సినిమాలను కూడా ఎవరూ చూడరు, ఇలాంటి సినిమాలను చేయొద్దు అంటూ తనుకు చాలా మంది సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమానే తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని ఈమె తెలియజేశారు.

Shivathmika: అంతా ఈజీ కాదని అర్థమైంది….

కెరియర్ మొదట్లో దొరసాని సినిమా చేసే సమయంలో తాను ఎన్నో ఊహించుకున్నాను ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ పోవడమేనని అనుకున్నాను అయితే నేను అనుకున్నంత ఈజీ కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఈమె తెలియజేశారు. ఇక రంగ మార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో నటించిన శివాత్మిక కొన్ని సన్నివేశాలలో అందరి చేత కంటతడి పెట్టించేలా నటించినదని చెప్పాలి

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago