Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఈమె వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు టాక్ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్నటువంటి మంచూ లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మంచు లక్ష్మి రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ వీడియోలు తన పర్సనల్ విషయాలను కూడా వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన వీడియోలను ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసారు. ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే మంచు లక్ష్మి తాజాగా ఒకప్పటి తన ఫోటోలను షేర్ చేశారు.
ఇలా ఈమెకి ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో దిగిన ఫోటోలను అలాగే తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో మంచు లక్ష్మి చూడటానికి ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉన్నారు. ఇలా అప్పట్లోనే ఎంతో అందంగా ఉన్నటువంటి మంచు లక్ష్మి తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికీ అదే స్థాయిలో వర్కౌట్లు చేస్తూ కష్టపడుతున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…