Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని భాషలలోనూ సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.అయితే కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున తనని ట్రోలింగ్ కి గురి చేస్తూ ఉంటాయి.
ఇలా తన గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో ఈ ట్రోలింగ్ పై ఇదివరకే ఈమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. తాను ఏం చేసినా ఏం చేయకపోయినా తనని ట్రోల్ చేస్తూ ఉంటారని, తాను ఎలా ఉండాలో కూడా మీరే చెప్పండి అంటూ ఒకానొక సమయంలో ట్రోల్స్ పై స్పందిస్తూ మండిపడ్డారు. అయితే ఆ ట్రోల్స్ నా వరకు వస్తే పర్వాలేదు కానీ తన ఫ్యామిలీ వరకు వెళ్లడం తనని ఎంతగానో బాధ పెడుతున్నాయి అంటూ వెల్లడించారు.
ఇకపోతే తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక డాన్స్ వీడియో షేర్ చేశారు అయితే ఇందులో ఈమె వేసుకున్న దుస్తులు కారణంగా మరోసారి నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు.ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రష్మిక స్టేజ్ పై డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పాటలకు రిహార్సల్స్ చేస్తున్నటువంటి డాన్స్ వీడియోని ఈమె షేర్ చేశారు.
ఇందులో భాగంగా రష్మిక వేసుకున్నటువంటి డ్రెస్ కారణంగా భారీగా ట్రోల్ అవుతున్నారు.కొందరు ఈ డాన్స్ వీడియో పై స్పందిస్తూ ఎందుకు రష్మిక అంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అసలు నిన్ను విజయ్ దేవరకొండ ఎలా ఇష్టపడ్డారు అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరికొందరైతే ఈ డ్రెస్ లో అచ్చం రికార్డు డాన్స్ చేసే వాళ్ల మాదిరిగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…