Balagam Fame Sujatha : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సినిమా గురించి ప్రస్తుతం తనకు దక్కుతున్న ప్రశంసల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నా డైలాగు కాపీ కొట్టారు…
బలగం సినిమా కంటే ముందు కొన్ని సినిమాలను చేసినా ఎవరూ అంతగా గుర్తించలేదని సుజాత తెలిపారు. బలగం సినిమా విడుదల అయ్యాక నేను అందులో చేశాను చూడండి అని చెప్పడం మర్చిపోయి ఆ సినిమా అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది చూడండి అని చెప్పాను అంటూ సుజాత తెలిపారు. గోదావరిఖని నుండి హైదరాబాద్ సినిమా వరకు సాగిన ప్రయాణంలో డబ్బు కంటే గుర్తింపు ఆర్టిస్టుకి ఆనందాన్ని ఇస్తుందని బలగం సినిమా నాకు గుర్తింపునిచ్చిందని తెలిపారు.
మా ఊరిలోనే కాకుండా పలు చోట్ల మాకు సన్మానలు చేస్తున్నారని తెలిపారు. ఇక సినిమాలో ఒక పాట మాది కాపీ కొట్టారు, కథ మాది కాపీ కొట్టారు వంటి కామెంట్స్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ విషయాలన్నీ నాకు తెలియవు కానీ నేను వర్షంతో మాట్లాడుతుంటా, నువ్వు ఇప్పుడు రా అనడం వర్షంతో ఆడుకోవడం వంటివి ఇప్పటికీ పిల్లలున్నా చేస్తుంటా, అలాగని ‘వర్షం’ సినిమాలో త్రిష డైలాగులు నావి కాపీ కొట్టారని అనలేను కదా. ఒక మంచి సినిమా వస్తే ఇలాంటివి ఇంకా రావాలని కొట్టుకోవాలి కానీ ఇది కాపీ అంటూ మాట్లాడితే ఎలా అంటూ అభిప్రాయపడ్డారు సుజాత.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…