Bandi Saroj Kumar : తమిళ, తెలుగు భాషలలో సమాజానికి ఉపయోగపడే సినిమాలను డైరెక్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న యివ దర్శకుడు బండి సరోజ్ కుమార్. హైదరాబాద్ కి చెందిన సరోజ్ కుమార్ అస్థానం, నిర్భంధం, నిర్భంధం2 సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలానే తమిళంలో తీసిన పోర్కాలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజం మీద ప్రభావం చూపే సినిమాలను తీసే బండి సరోజ్ కుమార్ సినిమాలు సాధారణ జనాలమీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న అంశం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు.
రతన్ రెడ్డి, జగన్ రెడ్డి వేరు…
లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మి పార్వతి ని నందమూరి ఫ్యామిలీ ఎలా అవమానలకు గురి చేసింది, ఎన్టీఆర్ ను లక్ష్మి పార్వతి ఎలా ప్రేమించి పెళ్లి చేసికుంది అన్న కోణంలో క్రితం ఎలక్షన్ ముందు ఆ సినిమాను తీశారు. అయితే ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని గబ్బు చేసారంటూ బండి సరోజ్ మాట్లాడారు. 90 లల్లో పుట్టిన తరం వారికి అప్పట్లో ఏం జరిగిందో పెద్దగా తెలియదు, కేవలం వేరే వాళ్ళు చెప్పిన విషయాలను విని ఒక ఒపీనియన్ కి రావాలి, నిజం ఏంటో తెలియదు.
ఆ సినిమాలో ఒక వైపు చూపించారు, జనాలను తప్పు దోవ పట్టించారు అంటూ బండి సరోజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. నేను లక్ష్మి పార్వతి గారి స్పీచులు అలాగే అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తున్నవి అన్నింటినీ కలిపి డాక్యుమెంటరి తీసాను అంటూ తెలిపారు. ఒక సినిమాలో సమాజంలో ఉన్న విషయాలను చెప్పాలి సమస్యలను సమాజంలోనివే తీసుకోవాలి కానీ డైరెక్టర్ అభిప్రాయాలను రుద్దకూడదు. నేను ఎవరి అభిమానిని కాదు, పాలిటిక్స్ లో న్యూట్రల్ గా ఉంటాను, నా సినిమా ‘సూర్యాస్తమయం’ సినిమాలో మాస్ లీడర్ గా ఎన్నికైన హీరో రతన్ రెడ్డి మన సీఎం జగన్ రెడ్డి వేరు. నేను కేవలం ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఫిక్షనల్ కథ తయారుచేసుకున్నా ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…