Comedian Komaram: బుల్లితెరపై ప్రసారమవుతున్న. కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ కొమరం ఒకరు.బహుశా కొమరం అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ కొమరక్క అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు.
జబర్దస్త్ కార్యక్రమంలో కొమరక్క పాత్రలో నటించిన కొమరం ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆ చీర కట్టు బొట్టు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. బయటకు ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని కొమరక్క అని పిలుస్తారని అలా పిలవడం తనకు చాలా ఆనందంగా ఉంటుందని తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కొమరం మాట్లాడుతూ తాను కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. అయితే హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపారు. కోటిలో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు గొడుగులు అమ్ముకుంటూ ఉండేవాడినని తెలిపారు అలాగే ఒక రెస్టారెంట్లో కూడా తాను పనిచేశానని కొమరం వెల్లడించారు. ఇలా పనులన్నింటినీ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించానని అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కాస్త ఇబ్బందులు పడ్డానని తెలిపారు.
ఇక నా జీవితంలో ఒకానొక దశలో ఐదు సంవత్సరాలు పాటు చాలా కష్టంగా గడిచిందని కొమరం తెలిపారు. ఐదు సంవత్సరాలు నరకం అనుభవించానని ఆ కష్టాలు మరి ఎవరికి రాకూడదని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తాను పనిచేస్తున్నటువంటి బుల్లితెర కార్యక్రమం ఆగిపోవడంతో కొమరక్క టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని తెలిపారు.అలాగే సినిమా అవకాశాలు రావడంతో బిజీగా ఉన్నానని తెలిపారు. తాజాగా నాని కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలో కూడా నటించానని ఈయన తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…