Actress Jyothi Reddy: బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికిపలు సినిమాలో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బుల్లితెర నటి జ్యోతి రెడ్డి ఒకరు. ఇలా తొమ్మిదవ ఏట ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పటికే పలు బుల్లితెర సీరియల్స్ అలాగే వెండితెరపై కూడా సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జ్యోతి రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జ్యోతి రెడ్డి మాట్లాడుతూ తాను ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు అంటూ తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి రెడ్డి. ఇలా 9వ ఏటా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. ఇక తనకు తన కుటుంబం అంటే ఎంతో గౌరవం ప్రాణమని తెలిపారు. అందుకే తన కుటుంబానికి సంబంధించిన వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించుకున్నానని తెలియజేశారు.
ఇక చదువుకుంటున్న సమయంలో తాను డిగ్రీ, ఎంఏ, ఎంఫీల్ ఇలా వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నానని తెలిపారు. ఇక తనకు చదవంటే ఎంతో ఇష్టం మంచి ఉద్యోగం చేయాలని కూడా కోరికగా ఉంది కానీ నా ఇంటి ముందు ఎంతో మంది డైరెక్టర్ల పిఏలు తమ ప్రాజెక్టులో నటించమని ఇంటి ముందు క్యూ కట్టేవారని, వారిని చూసి మా అమ్మ ఇంత పెద్ద వాళ్ళు నీకోసం వస్తే నటించను అంటావేంటి అంటూ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రోత్సహించిందని తెలిపారు. ఇలా అమ్మ వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఇక తన భర్త సాఫ్ట్వేర్ కాగా, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వాళ్ళను అమ్మ చూసుకుంటుందని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…