Srikanth: విడాకులు తీసుకోబోతున్న హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు..? వైరల్ అవుతున్న న్యూస్.. అసలు నిజం ఇదే..!

Srikanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా శ్రీకాంత్ విలన్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు. తాజాగా బాలకృష్ణ నటించిన సినిమాలో మరోసారి తన విలనిజంతో అందరిని భయపెట్టారు.

ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీకాంత్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈయన నటి ఊహను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇప్పటికే పెద్ద కుమారుడు రోషన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే తన కుమార్తె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్టు తెలుస్తోంది.

శ్రీకాంత్ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా కొనసాగుతూ ఉండగా తాజాగా ఈ దంపతుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాంత్ ఊహ మధ్య కొన్ని ఆర్థికపరమైన విషయాల పట్ల మనస్పర్ధలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై వీరిద్దరికీ గొడవలు జరుగుతున్నాయని త్వరలోనే విడాకులకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇక వీరిద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో పెద్దగా భావించే ఓ వ్యక్తి వీరికి సర్ది చెప్పినట్టు సమాచారం.

ఆర్థిక సమస్యల కారణంగానే తలెత్తిన మనస్పర్ధలు…

ఇలా శ్రీకాంత్ ఊహ దంపతుల గురించి మీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు అభిమానులు వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు తమ విడాకులపై వస్తున్నా వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. “ప్రస్తుతం ఊహ, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నామని, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామంటూ వస్తున్న వార్తలలో అస్సలు నిజం లేదని, ఎవరో కావాలని ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పుకార్లేనంటూ కొట్టిపారేశారు. దీనితో ఊహ, శ్రీకాంత్ విడాకులపై వస్తున్నటువంటి ఈ వార్తలు ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చేసారు శ్రీకాంత్.