Anchor Anitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించినటువంటి అనితా చౌదరి కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా ఈమె ఎన్నో బుల్లితెర సీరియల్స్ అలాగే వెండితెర సినిమాలలో కూడా నటించి సందడి చేశారు.యాంకర్ గా కొనసాగుతున్నటువంటి అనిత రుతురాగాలు కస్తూరి నాన్న వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక చత్రపతి సినిమాలో సూరీడు అంటూ ఈమె చెప్పిన డైలాగ్ ఎంతగానో ఫేమస్ అయింది.ఇలా పలు సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిత చౌదరికి చిన్నప్పుడు తన కుటుంబ బరువు బాధ్యతలను తనపై వేసుకొని పెళ్లికి దూరంగా ఉండి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని భావించారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె పెళ్లికి దూరంగా ఉన్నప్పటికీ కృష్ణ చైతన్య అనే వ్యక్తిని చూడగానే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ చైతన్యను వివాహం చేసుకున్న అనితా చౌదరి ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.ఇక అనిత చౌదరి వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల తో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు.
శ్రీకాంత్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అనిత చౌదరి..
ఇలా బుల్లితెర వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె హీరో శ్రీకాంత్ కు బంధువు అని చాలామందికి తెలియదు.అవును ఈమె పెళ్లి చేసుకున్న కృష్ణ చైతన్య అనే వ్యక్తి మరెవరో కాదు స్వయంగా శ్రీకాంత్ కజిన్ కావడం విశేషం. ఇలా కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అనిత చౌదరి హీరో శ్రీకాంత్ కు బంధువయ్యారు. అయితే ఈమెకు మొదట్లో శ్రీకాంత్ నటించిన తాళి సినిమాలో అవకాశం వచ్చిన నటించలేదు, కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన కజిన్ చేత తాళి కట్టించుకొని వారి ఫ్యామిలీలోకి అడుగు పెట్టారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…