Radhika Sarath kumar: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె లవ్ టుడే సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా మగాళ్ళను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఈమె సినిమాల్లో ఉండే కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పటికీ, ప్రస్తుత సమాజ ధోరణికి అద్దం పట్టేలా రాధిక వ్యాఖ్యలు ఉండడంతో ఒక్కసారిగా ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఉన్నటువంటి మగాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లవ్ టు డే సినిమా తెలుగులో నవంబర్ 25వ తేదీ విడుదల కానుంది. పెళ్లికి సిద్ధమైన ఓ జంట ఒకరోజు మొత్తం తమ ఇద్దరి ఫోన్లో మార్చుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాధిక మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఒక సినిమాలో హీరోకి ఇద్దరు భార్యలు ఉండేవారు వారిద్దరు కూడా పతియే ప్రత్యక్ష దైవం అని భావించే వాళ్ళు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్ పిల్లలలో అలాంటి ప్రేమలు అబద్ధం అయిపోయాయి..నిజంగా ఇక్కడ ఎవరైనా మగాడు ఉంటే నాకు ఒక్కరే అని సమాధానం చెప్పండి అంటూ ఈమె సవాల్ విసిరడంతో వెంటనే అనిల్ రావిపూడి నాకు ఒక్కరే అంటూ సమాధానం చెప్పారు.
ఒకరినే ప్రేమించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు..
అనిల్ రావిపూడి ఇలా చెప్పడంతో మీకు ఒక్కరే కానీ పక్కన ఇద్దరు అంటూ తనకు పంచ్ వేసింది.ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యువకులు ఒకరిని ప్రేమిస్తూ మరొకరీ గురించి ఆలోచించడం లేదు అనేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారని, అలా ఉన్నామని ఎవరైనా చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారు అంటూ ఈ సందర్భంగా రాధిక మగాళ్ళ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…