Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

Divorce: నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు విడిపోవడం వీరి ఫ్యాన్స్ కూడా మింగుడుపడలేదు. వీరితో పాటు 2021లో పలువురు ఫేమస్ కపుల్స్ విడిపోయారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్- కిరణ్ రావులు కూడా విడాకులు తీసుకున్నారు.

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!
Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

వీరితో పాటు రిలేషన్ షిప్ లో ఉన్న సుస్మితా సేన్- రోహ్మన్ షాల్ కూడా విడిపోయారు. అయితే తాజాగా దక్షిణాది సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్-మోనికా రిచర్డ్ దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో నాగ చైతన్య – సమంత విడాకుల అనంతరం అంతే సంచలనం కలిగించి విషయం తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ తన వివహ బంధానికి స్వస్తి పలకడం కూడా అంతే సంచలన కలిగించింది.

Divorce: విడాకులు ప్రకటించిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్..!

13 ఏళ్ల తమ వివాహ బంధానికి ఇమ్మాన్, మోనికా రిచర్డ్ స్వస్తి చెప్పారు. వాస్తవానికి 2020 లోనే ఈ జంట విడిపోయింది. అయితే తాజాగా ఈవిషయాన్ని ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. సౌత్ ఇండస్ట్రీలో ఇలా సెలబ్రిటీ జంటలు విడిపోవడం సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి.  నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

చట్టబద్ధంగానే విడాకులు..

మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలు కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా, జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహన, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌.  డి. ఇమ్మాన్ తమిళంలో స్టార్ మ్యూజిషియన్ గా ఉన్నాడు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇటీవల రజినీ కాంత్ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్నగా డబ్బింగ్ అయిన సినిమాకు ఇమ్మాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. అంతకు ముందు అజిత్ విశ్వాసం సినిమాకు కూడా సంగీతం అందించాడు.