Subbaraya Sharma : బ్రాహ్మణులను గురించి వెకిలిగా మాట్లాడితే నచ్చదు… అన్నపూర్ణమ్మకు విషం పెట్టి చంపాలన్నారు…: సుబ్బరాయ శర్మ

Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటకరంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయ శర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయనకు ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

బ్రాహ్మణులను వెకిలి చేస్తే నచ్చదు…

చాలా సినిమాల్లో దేవుడి అర్చకుడిగా చేసిన సుబ్బరాయ శర్మ గారు అర్చకుడి వేషాలు వచ్చినా చాలా సినిమాల్లో ఆయన చేయలేదు. దీనికి కారణం కేవలం గుడిలో పూజారిగా ఏదో పూజ చేసి ప్రసాదం పెట్టే పాత్ర చేయకూడదు అనే ఉద్దేశంతో చేయలేదట. ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్ర అయితే చేయొచ్చు కానీ ప్రాముఖ్యత లేకుండా కేవలం పూజ చేసే పాత్ర ఎందుకు చేయాలని అనిపించింది. నటన మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చాను డబ్బు కోసం కాదు అని సుబ్బరాయ శర్మ గారు అభిప్రాయపడ్డారు. ఇక సింహాద్రి, పంచాక్షరీ వంటి సినిమాల్లో అర్చకుడి పాత్ర చేసినా అందులో ప్రాధాన్యత ఉంది అందుకే చేశాను అంటూ చెప్పారు.

ఇక నెగెటివ్ షేడ్ పాత్రలో నటించకపోడానికి గల కారణాలను వివరిస్తూ ఎక్కువగా మంచి క్యారెక్టర్ లో చూడటం వల్ల నెగెటివ్ షేడ్ నేను చేయను అని డైరెక్టర్లు భావించి ఉండవచ్చు. ఇక ముత్యాల సుబ్బయ్య గారు మాత్రం ఆయన డైరెక్టర్ గా తీసిన సినిమాల్లో నాకు నెగెటివ్ షేడ్ వేషం ఇచ్చారు. అందులో అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ గారిని విషం పెట్టి చంపే పాత్రలో నటించాను. ఆ పాత్రలో నన్ను జనాలు ఒప్పుకోరేమో అనుకున్నాను. ఇదే విషయం ముత్యాల సుబ్బయ్య గారితో చెబితే ఆయన ఇంతవరకు మంచి పాత్రల్లో నిన్ను చూసిన ప్రేక్షకులు నువ్వు ఇలాంటి నెగెటివ్ షేడ్ చేస్తావని అనుకోరు, అందుకే నిన్ను పెట్టాలనుకున్నాను అని చెప్పారు అంటూ సుబ్బరాయ శర్మ తెలిపారు.