Sudigaali Sudheer: ఆల్రెడీ ‘ఢీ’ మానేశాను ఇంకా ఏం మానేయాలిరా బాబు.. తనపై తాను సెటైర్లు వేసుకున్న సుధీర్..

Sudigaali Sudheer: తెలుగు టెలివిజన్ షోల్లో జబర్థస్త్ తర్వాతే మరేదైనా.. అంతలా ఆకట్టుకుంటోంది. జబర్థస్త్  ప్రారంభం అయినప్పటి నుంచి ఈ షోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఎక్కడా టీఆర్పీ రేటింగులు తగ్గకుండా తన మార్క్ ను కంటిన్యూ చేస్తోంది జబర్థస్త్ షో. గురు, శుక్రవారాల్లో ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ షోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.

Sudigaali Sudheer: ఢీ మానేశాను ఇంకా ఏం మానేయాలి… అంటూ తనపై తాను సెటైర్లు వేసుకున్న సుధీర్..ప్రోమో వైరల్!

ఇటు కంటెస్టెంట్ల కామిడీ స్కిట్లతో పాటు.. జబర్థస్త్ భామలుగా పేరు తెచ్చుకున్న అనసూయ, రష్మీలు మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి. వీరితో పాటు యాంకర్ రోజా, మనోలతో పాటు సుడిగాలి సుధీర్, ఆది పంచులు షోకే పెద్ద ఎస్సెట్. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన రెండు షోలకు అనసూయ యాంకరింగ్ చేయలేదు.

Sudigaali Sudheer: ఢీ మానేశాను ఇంకా ఏం మానేయాలి… అంటూ తనపై తాను సెటైర్లు వేసుకున్న సుధీర్..ప్రోమో వైరల్!

ఈ రెండు షోలను రష్మీతోనే లాగించారు. అయితే తాజాగా మళ్లీ అనసూయ జబర్థస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. ’ ఏయ్ బిడ్డా ఇది జబర్థస్త్ సరికొత్త అడ్డా‘ అంటూ ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో సరికొత్త జబర్థస్త్ సెట్ మనముందుకు వస్తోంది.

Sudigaali Sudheer: ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది..

ఈనెల 6న టెలికాస్ట్ అయ్యే షో ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది, సుధీర్ ఇరగదీశారు.  ప్రోమోలో ఆది పంచులు, సుడిగాలి సుధీర్ స్కిట్లో  పంచులు పేలాయి. ఆది నీళ్లు తాగుతుంటే.. ఇంకా తాగవా..అని సుధీర్ అడగ్గా నీ అంత దాహం లేదని ఆది పంచ్ వేశాడు. మానవా.. మానవా.. అంటూ లేడి గెటప్పు సుధీర్ ని అడిగితే.. ఇప్పటికే ’ఢీ‘ మానేశాను ఇంకేం మానేయాలి అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. ఇటీవల ఢీ షో నుంచి సుధీర్ ని, రష్మీని తొలగించారు. అయితే వీరిద్దరిని తొలగించిన తర్వాత ఢీ షో రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఢీ షోకి రావాలని అడుగుతున్నారు.