surekha Vani: కొత్త కారు కొనుగోలు చేసిన సురేఖవాణి… రచ్చ చేస్తున్న తల్లి కూతుర్లు!

surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.తన కూతురు సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ పలు వెకేషన్ లకు వెళుతూ ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ మాములుగా లేదు.ఇలా తరచూ ఎన్నో రకాల వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్న సురేఖవాణి తాజాగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీతతో కలిసి కొత్తకారులో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సురేఖ వాణి కొత్త కారును కొనుగోలు చేయడంతో ఎంతోమంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

surekha Vani:కొత్త కారుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నటి…

ఇకపోతే మరికొందరు యధావిధిగా ఈ ఫోటోలపై స్పందిస్తూ మామూలుగానే సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ తల్లి కూతుర్లు ఇక కొత్త కారు కొన్న తర్వాత వీరి రచ్చ ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా సురేఖవాణి తన కూతురు సుప్రీత హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే చెప్పాలి.