Featured

Balagam fame Kota Jayaram : బలగం సినిమాకు హీరో నేనే… అతనికి పాటలు ఉన్నాయి నాకు లేవంతే…: బలగం ఫేమ్ కోట జయరాం

Balagam fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా సినిమాలో హీరోకి తండ్రిగా నటించిన కోట జయరాం గారు బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆయన కెరీర్ గురించి మాట్లాడారు.

సినిమాకు నేనే హీరో…

బలగం సినిమాలో హీరో సాయిలు కి తండ్రిగా కొమరయ్య కొడుకుగా ఐలయ్య పాత్రలో నటించిన జయరాం గారి నటన ఆకట్టుకుంది. ఆ పాత్ర గురించి సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మొత్తం ఉండే పాత్రలో మొదటి సారి చేసాను అంటూ చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకు హీరో నేనే అనొచ్చు, బావతో గొడవ పడటం, మళ్ళీ చెల్లి కోసం ఏడవడం, ఇక తమ్ముడితో తగాదా ఇలా ప్రతి సంఘటన నాతో ముడిపడి ఉన్నాయి.

ఇందులో హీరో హీరోయిన్లు గా ఉన్న సాయిలు, సంధ్య కి పాట ఉందేమో నా పాత్రకు అలా పాటలు లేవు అంతే సినిమా మొత్తం నా చుట్టూ నడుస్తుంది అందుకే సినిమాకు నేనే హీరో అనిపించింది. అది కూడా షూటింగ్ అపుడు అనిపించలేదు కానీ సినిమా చూస్తున్నపుడు ప్రతి సీన్ లో నేనున్నాను, కథలో కీలక పాత్ర కదా నాది అన్నపుడు చాలా ఆనందంగా అనిపించింది అంటూ చెప్పారు జయరాం.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

1 day ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

1 day ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

1 day ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

1 day ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

1 day ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

1 day ago