SV Krishna Reddy: నాకు ఏ పని రాదంటూ కామెంట్స్ చేశారు… చివరికి స్వీట్ షాపులో పనిచేశా: ఎస్వీ కృష్ణారెడ్డి

SV Krishna Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా సంగీత దర్శకుడిగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలన్నీ కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబ విలువలను ఎంతో అద్భుతంగా చాటిచెప్పే సినిమాలను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే చాలా సంవత్సరాలు తర్వాత ఈయన తిరిగి మెగా ఫోన్ పట్టబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాది ఉన్నతమైన కుటుంబం కానీ సినిమాలు చేసే అంత డబ్బు మా దగ్గర లేదు.పీజీ పూర్తి చేసే హీరో అవుదాం అనుకొని మద్రాసు వెళ్లాను కానీ అది అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్నాను.ఇలా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మొదటిసారి తాను పగడపు పడవలు అనే సినిమాలో సెకండ్ హీరోగా నటించాను. నన్ను చూసిన అచ్చిరెడ్డి నీకు ఇది సరైనది కాదు మనమే ఓ సినిమా చేద్దామని సలహా ఇచ్చారు.

SV Krishna Reddy: ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయలేదు…


ఇలా తన దగ్గర ఏమాత్రం డబ్బు లేకపోయినా సినిమా ఎలా చేయగలమని చెబితే ఆయన తన పేరు మీద ఒక స్వీట్ షాప్ పెట్టారు. నేను అందులో కాజాలు లడ్డులు చేస్తూ పనిచేసాను. ఇలా వచ్చిన డబ్బుతో కొబ్బరి బొండం అనే సినిమా చేసాము.మొదటి సినిమా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత తాను సినిమాలు చేస్తూ ఉండగా ఇండస్ట్రీలో తనపై చాలామంది విమర్శలు చేశారు. తనకు సినిమా డైరెక్షన్ రాదు మ్యూజిక్ డైరెక్షన్ రాదు. ఘోస్ట్ లనుపెట్టుకొని మేనేజ్ చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే అలా విమర్శలు చేయడానికి కారణం లేకపోలేదు. తాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి విమర్శలు వచ్చాయని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.