Featured

Nandamuri Tarakaratna : 40 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిన తారకరత్న… అటు తాతకు చెడ్డ పేరు రాకుండా… ఇటు తన ప్రేమ వదులుకోకుండా…!

Nandhamuri Tarakaratna : నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక రత్న ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమాయ్యడు. 1983 ఫిబ్రవరి 22 న జన్మించిన తారకరత్న మోహన కృష్ణగారి తనయుడు. ఆయనకు ఒక చెల్లి మోహన రూప ఉన్నారు. ఇక తల్లి వైపు నుండి ఆయన పెద్ధ నిర్మాత విశ్వేశ్వరయ్య మనవడు. ఇలా రెండు వైపులా బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉన్నా తారకరత్న మాత్రం ఎపుడూ లో ప్రొఫైల్ మైంటైన్ చేసేవాడట. చిన్నతనం నుండి అల్లరి ఎక్కువగా చేసే తారకరత్నకు తండ్రి ఒకసారి మందలిస్తూ నీ ఇష్టాలు, సరదాలు నీకున్నా తాత పేరు చెడగొట్టకు అంటూ చెప్పడంతో అప్పటి నుండి తాను ఎవరో ఎవరికీ చెప్పేవాడు కాదట. ఇక బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టమున్న తారకరత్న ఇంట్లో చెప్పకుండా బైక్ వేసుకుని లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాడట. ఇక హరికృష్ణ తనయలు జానకి రామ్, కళ్యాణ్ రామ్ లతో ఎక్కువగా ఉన్న తారకరత్న తాత సీఎం అయ్యాక పుట్టిన మనవడు. ఎక్కువగా కళ్యాణ్ రామ్ తో అల్లరి చేసేవాడట అయితే వీరిద్దరినీ జానకిరామ్ కంట్రోల్ చేసేవాడట. అందుకే జానకిరామ్ మరణం ఆయనను బాగా క్రుంగదీసిందని తారకరత్న ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

హీరోగా వచ్చి విలన్ గా నంది అవార్డు కొట్టిన తారకరత్న…

ఎన్టీఆర్ కు మనవళ్లలో తారకరత్న అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అందుకే వారిద్దరికి తన భార్య పేరు కలిసివచ్చేలా తారక పేరును కలిపి పేర్లు పెట్టాడట. హీరోగా తారకరత్న ఎంట్రీ ఇచ్చేసరికే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ సినిమాల్లోకి వచ్చేసారు. ఇక తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు వచ్చేసరికి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ చేస్తున్నాడు. ఒకానొక టైం లో ఎన్టీఆర్ కి పోటీగా తారకరత్న ఇండస్ట్రీకి వచ్చాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడుతూ నాకు సినిమాల్లోకి రావాలని ఇష్టం అందుకే వచ్చాను అంతే కానీ వాళ్లకు పోటీగా కాదు. నేను రాకముందే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు సినిమాలను చేసారు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అందరితోనూ కలివిడిగా ఉంటూ అందరి మంచి కోరుకునే తారకరత్న అలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరమయ్యారు. అలేఖ్య రెడ్డి వైసీపీ నేత విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురు అవుతుంది. ఇక అలేఖ్య రెడ్డి కి అప్పటికే వివాహం జరిగి విడాకులు తీసుకుంది.

దీంతో ఆమెతో పెళ్ళికి మొదట అందరూ నిరాకరించినా ప్రేమను వద్ధనుకోలేదు తారకరత్న. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సంఘీ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాడు. పాప పుట్టాక మళ్ళీ కుటుంబంతో కలిసాడు. అయితే తన కెరీర్ పరంగా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా తీసుకుంటానని చెప్పే తారక రత్న ఆ అలవాటును బాబాయ్ బాలకృష్ణ, పెదనాన్న హరికృష్ణ వద్ద నేర్చుకున్నట్లు చెబుతాడు. నందమూరి ఇంట్లో అందరితోనూ ఆప్యాంగా ఉండే తారకరత్న ప్రస్తుతం టీడీపీ పార్టీ కోసం 2009 నుండి పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికలలో పోటీ చేయాలని కోరుకున్న ఆయన ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం వారి కుటుంబానికి, టీడీపీ శ్రేణులకే కాదు తెలుగు ప్రజలందరికీ బాధను మిగిల్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago