Movie News

Tarakaratna: పాదయాత్ర మొదటి రోజు జరిగిన తప్పే తారకరత్న ప్రాణాలకు ముప్పుగా మారిందా..?

Tarakaratna: నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు మొదటి రోజే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. 23 రోజులుగా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ తాజాగా శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. 23 రోజులుగా ప్రాణాలతో పోరాడిన నందమూరి తారకరత్న ఇలా తుది శ్వాస విడవటంతో నందమూరి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గత 23 రోజులుగా తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వైద్యం తీసుకుంటున్నాడు. పాదయాత్రలో గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి అప్పటినుండి విషమంగానే ఉంది. గుండెపోటు రావటమే కాకుండా మెదడు పనితీరు లేకపోవడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. బెంగళూరుకి తరలించిన మొదటి రోజు నుండి శనివారం రాత్రి వరకు డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అహర్నిశలు కృషి చేశారు. అంతే కాకుండా విదేశాల నుండి డాక్టర్ బృందాన్ని కూడా రప్పించారు.

విదేశీ వైద్యుల రాకతో తారకరత్న పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని నందమూరి కుటుంబ సభ్యులలో ఆశలు మొదలయ్యాయి. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడి ఆయన ప్రాణాలతో బయటపడాలని నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా పూజలు, హోమాలు చేయించారు. అయితే శనివారం రోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కన్ను మూశాడని తెలియడంతో ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.

Tarakaratna: ఆ చిన్న తప్పే తారకరత్న ప్రాణాలను తీసిందా…


తారకరత్న ఎంతో ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి ఇలా తిరిగి రావడం ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. 23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు ప్రయత్నించినా కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి మొదటి రోజు తప్పే కారణమా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తారకరత్నకు గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేయకుండా 45 నిమిషాల పాటు ఆలస్యం చేయటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే కనుక ఆయనకు సిపిఆర్ చేసి ఉంటే ప్రాణాలతో తిరిగి వచ్చేవారని భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago