Movie News

Tarakaratna: మరో ఐదు రోజుల్లో తారక రత్న కొత్త సినిమా విడుదల… ఇంతలోనే విషాదం!

Tarakaratna: నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈయన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి తారకరత్న ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇలా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి తారకరత్న సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ వచ్చారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి ఈయన గత నెల 27వ తేదీ నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా లోకేష్ కు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఇక ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్నకు గుండెపోటు రావడంతో ఈయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈయనని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజులు పాటు చికిత్స తీసుకుంటూ ఈయన చివరికి తుది శ్వాస విడిచారు.

ఇలా ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇకపోతే తారకరత్న మరణించడంతో ఈయన చివరిగా నటించిన చిత్రం మరి ఐదు రోజులలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా విడుదల కాకుండానే తారకరత్న మరణించడంతో చిత్ర బృందం కూడా ఎంతో విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఈయన చివరిగా నటించిన చిత్రం మిస్టర్ తారక్.

Tarakaratna: మిస్టర్ తారక్…


ఈ సినిమాని ఫిబ్రవరి 24 వతేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే జనవరి 27వ తేదీ ఈయన గుండె పోటుకు గురి కావడంతో నిర్మాతలు సైతం ఈయన క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తారకరత్న ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపరకపోవడమే కాకుండా మరింత విషమంగా మారడంతో ఈయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇలా తారకరత్న నటించిన చివరి సినిమా విడుదల కాకుండానే మరణించడంతో అభిమానులు మరింత విచారం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago