దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకప్పటి చిరంజీవి సినిమాలో నటించారు…ఆ సినిమా ఏమిటో మీకు తెలుసా.?

1990 దశకంలో ఎస్.వి.కృష్ణారెడ్డి కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే తెలుసు.ఆయన దర్శకత్వంలో వచ్చిన కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ వన్, యమలీల, ఘటోద్గజుడు, గన్ షాట్, టాప్ హీరో, శుభలగ్నం, మావి చిగురు, ఊయల, అభిషేకం, ఉగాది, ఆహ్వానం, వినోదం, ఎగిరే పావురమా, పెళ్ళాం ఊరెళితే లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

రాజేంద్ర ప్రసాద్, సూపర్ స్టార్ కృష్ణ, అలీ, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, జె డి చక్రవర్తి, జగపతి బాబు, శ్రీకాంత్ ఇలా.. ఒక చిరంజీవి మినహా అప్పుడు అందుబాటులో ఉన్న అందరి హీరోల సినిమాలకు దర్శకుడిగా ఎస్.వి కృష్ణారెడ్డి చేయడం జరిగింది. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు తప్ప చిన్న హీరోలతో చేసిన అన్ని సినిమాలు కూడా హిట్ కావడం ఒక విశేషం.

సూపర్ స్టార్ కృష్ణ తో చేసిన నెంబర్ వన్ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించగా సాంప్రదాయం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాగార్జునతో వజ్రం,బాలకృష్ణ తో టాప్ హీరో, రాజశేఖర్ తో దీర్ఘ సుమంగళీభవ, జగపతిబాబుతో అతడే ఒక సైన్యం సినిమాలు ఫ్లాప్ సినిమాలు గా మిగిలాయి. ఈ సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయినప్పటికీ పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మోగుతూనే ఉంటాయి.

హీరోలలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, శ్రీకాంత్ లతో ఎస్.వి.కృష్ణారెడ్డి ఎక్కువ సినిమాలు తీయడం జరిగింది. హీరోయిన్స్ లలో సౌందర్య, ఆమని, రమ్యకృష్ణ లతో ఎక్కువ సినిమాలను రూపొందించారు. తన కథలన్నీ కుటుంబ నేపథ్యం గా తీసుకున్నప్పటికీ హాస్యాన్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకునేవాడు.

బాబు మోహన్, బ్రహ్మానందం లతో ఆయన సినిమాలలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ కూడా నడిపించేవాడు. మాయలోడు చిత్రంలో ఏకంగా సౌందర్య బాబు మోహన్ లతో చినుకు చినుకు అందెలతో అనే పాటను పెట్టి హిట్ కొట్టించాడు. అయితే దర్శకుడిగా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఎస్ వి కృష్ణారెడ్డి 1976 లోనే సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అలా 1986లో చిరంజీవి హీరోగా వచ్చిన కిరాతకుడు సినిమా లో విలన్ ప్రక్కన విలక్షణమైన వేషాన్ని ఎస్.వి.కృష్ణారెడ్డి ధరించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.