దిల్ రాజు సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కేవలం ఒక్క రోజే సమయం ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించి 46 షాట్స్ మిగిలి ఉన్నాయి. దిల్ రాజు ఇదివరకే యూనిట్ అందరికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు. ఇప్పుడు ఎలా అని దిల్ రాజు చాలా టెన్షన్ లో ఉన్నారు. సుకుమార్, భాస్కర్ లకు దిల్ రాజు విషయం ఇలా ఉందని చెప్పగా.. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ స్పందిస్తూ.. మీరు టెన్షన్ పడకండి సార్ 46 షాట్లు సుకుమార్ నేను కలిసి రాత్రి ప్లాన్ చేసుకొని రేపు పూర్తి చేస్తామని అనడంతో దిల్ రాజు కు ప్రాణం లేచి వచ్చింది.
అలా అప్పటికప్పుడు భాస్కర్ 46 షాట్లు ప్లాన్ చేయడం దిల్ రాజుకు ఆశ్చర్యం వేసింది. ఆ సమయంలో ఒక మంచి కథ తయారు చేసుకో మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అని దిల్ రాజు భాస్కర్ తో చెప్పడం జరిగింది. భాస్కర్ ఆర్య సినిమా తర్వాత భద్ర సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో తాను రాసుకున్న కథను దిల్ రాజుకు వినిపించారు. ఆ కథ నచ్చడంతో దిల్ రాజు సినిమా మొదలు పెడదామని నిర్ణయానికి రావడం జరిగింది.
మొదటగా ఈ కథను అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు చెప్పగా వారు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అలా ఈ సినిమా సిద్ధార్థ చేతిలోకి వెళ్ళింది. ఈ సినిమాకి హీరోయిన్ గా మొదటగా సింధుతులాని అనుకున్నారు. కానీ హ్యాపీ సినిమా చూసిన తర్వాత జెనీలియాను బుక్ చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం జరిగింది.
బొమ్మరిల్లు స్టోరీ.. డైరెక్టర్ భాస్కర్ ది అయినప్పటికీ డైలాగ్స్ మాత్రం రైటర్ అబ్బూరి రవి రాయడం జరిగింది. వీలైతే నాలుగు మాటలు కుదిరితే ఓ కప్పు కాఫీ.. అలానే మూవీ క్లైమాక్స్ లో వచ్చే అంతా మీరే చేశారంటూ.. హీరో సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను కన్నీటి పర్యాయంతమయ్యేలా చేసింది. అల్లరి, చిలిపి ప్రవర్తనతో జెనీలియా ప్రతి ఒక్కరి మనసు దోచింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి జెనీలియా ప్రతిసారి నైట్ టైం ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్లడం.. ఆ తర్వాత రోజుల్లో లవర్స్ కి అదొక ఫ్యాషన్ గా మారిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…