Tag Archives: 15 lakhs

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

Trending News: ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వచ్చి పడితే ఏం చేస్తాం. ఎక్కడి లేని సంతోషపడుతాం. ఆ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయోనని ఆరా తీస్తాం. అవి పొరపాటున ఖాతాలో జమయ్యాయని తెలిస్తే షాక్ కు గురవుతాం. సరిగ్గా ఓ రైతుకు ఇలాగే జరిగింది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

వచ్చిన డబ్బులో రూ.9లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తీరా ఆ నగదు తనకు రావాల్సింది కాదని తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. ఆ ఖర్చు చేసిన మొత్తం కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఎలా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామంలో చోటుచేసుకుంది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

దావర్వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. చిన్నా చితకా పనులు చేస్తూ జీవించేవాడు. కొంతకాలం క్రితం అతను తన జన్ ధన్ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోగా రూ.15లక్షలు జమ అయి ఉన్నాయి.


దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ..

2014 ఎన్నికల సమయంలో భాజపా అధికారంలోకి వస్తే వస్తే విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం తిరిగి వెనక్కి తెస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేయొచ్చని చెప్పారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ధ్యానేశ్వర్ తన ఖాతాలో మోదీనే నగదు జమ చేసి ఉంటుందని సంబరపడ్డాడు. దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ఓ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. ఆ ఆనందంలోనే అతనికి అందిన ఓ లేఖ పిడుగులాంటి వార్తను తెచ్చింది. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాలో జమయ్యాయి. వాటిని మీరు తిరిగి చెల్లించాలి’ ఇది ఆ లేఖలోని సారాంశం. ఇది చదివి ఆ రైతు కంగుతిన్నాడు. ఖాతాలో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించినా.. ఖర్చు చేసిన డబ్బును ఎలా చెల్లించాలా ఆ రైతు తలపట్టుకున్నాడు.

రియల్ చిన్నతల్లికి రూ.15 లక్షలు అందజేసిన సూర్య..

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ లో విడుదలైన జై భీమ్ .. ఎంతటి ఘన విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్టులను తిరగరాసింది ఈ సినిమా. యదార్థ ఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. దీనిలో కోలీవుడ్‌ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్ పాత్రలో నటించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కురిపించుకున్నారు.

ఈ సినిమా ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్‌’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది.

దీనిలో సిన్నతల్లిగా నటించి లిజోమోల్ అద్భుతంగా నటించారు. రియల్ సిన్నతల్లి పేరు పార్వతి. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు ఆమెకు. అయితే దీనిపై స్పందించిన లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. సూర్య కూడా అంతక ముందే ఆమెకు రూ. 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు సార్థకం చేసే రోజు రానే వచ్చింది.

ఆమెకు రూ.15 లక్షల రూపాయలను అందజేశారు సూర్య. తన తరఫున రూ.10 లక్షలు.. చిత్ర నిర్మాణం తరఫున మరో రూ.5లక్షలు అంటూ ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయించారు హీరో సూర్య. చెప్పడమే కాకుండా.. ఆ మాటను నిలబెట్టుకొని చూపించిన సూర్యను అక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు.