ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ లో విడుదలైన జై భీమ్ .. ఎంతటి ఘన విజయం సాధించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్టులను తిరగరాసింది ఈ సినిమా. యదార్థ ఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. దీనిలో కోలీవుడ్ నటుడు సూర్య.. చంద్రు అనే లాయర్ పాత్రలో నటించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు కురిపించుకున్నారు.
ఈ సినిమా ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది అంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది.
దీనిలో సిన్నతల్లిగా నటించి లిజోమోల్ అద్భుతంగా నటించారు. రియల్ సిన్నతల్లి పేరు పార్వతి. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు ఆమెకు. అయితే దీనిపై స్పందించిన లారెన్స్ ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. సూర్య కూడా అంతక ముందే ఆమెకు రూ. 10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు సార్థకం చేసే రోజు రానే వచ్చింది.
ఆమెకు రూ.15 లక్షల రూపాయలను అందజేశారు సూర్య. తన తరఫున రూ.10 లక్షలు.. చిత్ర నిర్మాణం తరఫున మరో రూ.5లక్షలు అంటూ ఆమె అకౌంట్లో డిపాజిట్ చేయించారు హీరో సూర్య. చెప్పడమే కాకుండా.. ఆ మాటను నిలబెట్టుకొని చూపించిన సూర్యను అక్కడి ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…