తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. 10 వారాలు కంప్లీట్ చేసుకొని 11 వ వారం రన్ అవుతోంది. ప్రస్తుతం 11 వ వారం కెప్టెన్ ఎవరనే దానిపై టాస్క్ లు నడుస్తున్నాయి.
ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఇంటికి వెళ్లి పోయారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా వెళ్లాల్సి వచ్చింది. మిగిలింది 9 మంది మాత్రమే. అయితే అందులో కూడా ఈ వారం 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 4 లో మోనల్ గుర్తుంది కదా.. రెండు లవ్ ట్రాక్ లు నడిపించి.. చివరి వరకు వచ్చింది.
ఆమె తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. ప్రస్తుతం యానీ మాస్టార్ ఈ వారం ఇంటి నుంచి వెళ్లి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే యానీ మాస్టార్ కు గుడ్ బై చెబుతుండటంతో ఆమె అయోమయానికి గురయ్యారు. వాటికి సమాధానంగా మోనల్ ఇలా చెప్పింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి.. దయచేసి యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ అభ్యర్థించారు. యానీ మాస్టార్ నాకు వ్యక్తిగతంగా తెలుసని.. ఆమె ఎంతో స్ట్రాంగ్ అంటూ చెప్పుకొచ్చింది.
ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా సినీ పరిశ్రమలోకి వచ్చి తన కష్టంపై తాను నిలబడుతుందని.. అలాంటి వారికి మన సపోర్టు ఉండాలంటూ చెప్పింది మోనాల్. ఆమె ఇల్లు కొనుగోలు చేయాలనే ఆశతో బిగ్ బాస్ కు వెళ్లినట్లు ఆమె చెప్పింది. ఆమె కల నెరవేరాలని తాను కోరుకుంటున్నానని.. మీరు కూడా యానీ మాస్టార్ కు సపోర్టు చేయండి అంటూ వీడియో పోస్టు చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…