Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..
Trending News: ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వచ్చి పడితే ఏం చేస్తాం. ఎక్కడి లేని సంతోషపడుతాం. ఆ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయోనని ఆరా తీస్తాం. అవి పొరపాటున ఖాతాలో జమయ్యాయని తెలిస్తే షాక్ కు గురవుతాం. సరిగ్గా ఓ రైతుకు ఇలాగే జరిగింది.
వచ్చిన డబ్బులో రూ.9లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తీరా ఆ నగదు తనకు రావాల్సింది కాదని తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. ఆ ఖర్చు చేసిన మొత్తం కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఎలా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామంలో చోటుచేసుకుంది.
దావర్వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. చిన్నా చితకా పనులు చేస్తూ జీవించేవాడు. కొంతకాలం క్రితం అతను తన జన్ ధన్ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోగా రూ.15లక్షలు జమ అయి ఉన్నాయి.
2014 ఎన్నికల సమయంలో భాజపా అధికారంలోకి వస్తే వస్తే విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం తిరిగి వెనక్కి తెస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేయొచ్చని చెప్పారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ధ్యానేశ్వర్ తన ఖాతాలో మోదీనే నగదు జమ చేసి ఉంటుందని సంబరపడ్డాడు. దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ఓ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. ఆ ఆనందంలోనే అతనికి అందిన ఓ లేఖ పిడుగులాంటి వార్తను తెచ్చింది. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాలో జమయ్యాయి. వాటిని మీరు తిరిగి చెల్లించాలి’ ఇది ఆ లేఖలోని సారాంశం. ఇది చదివి ఆ రైతు కంగుతిన్నాడు. ఖాతాలో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించినా.. ఖర్చు చేసిన డబ్బును ఎలా చెల్లించాలా ఆ రైతు తలపట్టుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…