Tag Archives: 7 arts sarayu

7 Arts Sarayu: తనపై కేసు పెట్టడానికి కారణం అదే..! అసలు విషయం బయట పెట్టిన సరయు..!

7 Arts Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ వివాదం జరుగుతున్న సంగతి తెలసిందే. బంజారా హిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారంటూ.. కేసు నమోదైంది. దీనిపై సరయు క్లారిటీ ఇచ్చింది.

7 Arts Sarayu: తనపై కేసు పెట్టడానికి కారణం అదే..! అసలు విషయం బయట పెట్టిన సరయు..!

కాగా.. గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ కు చెందిన ఓ హోటల్ ను సిరిసిల్లలో ప్రారంభం చేేసే సమయంలో ప్రమోషన్ కోసం ఓ షార్ట్ ఫిలిం వీడియోను చేసింది. గిప్ప నిస్తా అనే షార్ట్ ఫిలిం తీసింది. హోటల్ ప్రమేషన్లలో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ షార్ట్ ఫిలింని షూట్ చేశాడు.

7 Arts Sarayu: తనపై కేసు పెట్టడానికి కారణం అదే..! అసలు విషయం బయట పెట్టిన సరయు..!

గణపతి బప్ప మోరియా అనే రిబ్బన్లు కట్టుకుని మద్యం సేవించే సీన్ ఉంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హోటర్ ప్రారంభం కానివ్వమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది వీహెచ్పీ. అయితే ఈ సీన్ ఎడిట్ చేసి ఫిబ్రవరి 26న మోటన్ ని ప్రారంభించారు.


సిరిసిల్ల పోలీసులు కేసులు ..

అయితే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్కడితే విషయం పరిష్కారం అయిందని  సరయు అంటుంది. ఈ వివాాదంపై తరువాత మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇప్పడు సిరిసిల్ల పోలీసులు కేసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారని తెలిసింది. నాకు పోస్టు వచ్చే వరకు ఈ విషయం తెలియదని సరయు వెల్లడించింది. దానికి సంబంధించి పిలిచి మాట్లాడేందుకే పోలీసులు స్టేషన్ కి పిలిచారని చెప్పింది. పోలీసుల ముందు వివరణ ఇచ్చినట్లు తెలిపింది. ‘‘ఓ హిందూ కుటుంబంలో పుట్టిన తను ఎవరీ మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని.. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా అందరికీ సారి‘‘ అంటూ జరిగిన ఘటనపై క్షమాపణు చెప్పింది.

బిగ్ బాస్ లో అతను తప్ప అందరూ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన 7 ఆర్ట్స్ సరయు..!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలోకి యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెవెన్ ఆర్ట్స్ సరయు ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన ఈమె బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో రెచ్చిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇకపోతే తాజాగా సరియు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈమె రవి ఎలిమినేట్ అవుతాడని చేశారా లేక పోతే తనకు సపోర్ట్ చేయమని చేశారో తెలియదు కానీ ఈమె రవికి సపోర్ట్ చేయమని పోస్ట్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా ఫేక్ అని ఒక రవి తప్ప అంటూ రవి గురించి కామెంట్ చేశారు. కనుక రవికి మద్దతు తెలపండి అంటూ ఈమె తన అభిమానులను వేడుకుంది. అయితే సరయు రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఇలా ఎందుకు కామెంట్ చేశారన్న విషయం తెలియడం లేదు. అతను ఎలిమినేట్ కాడన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి కామెంట్ చేశారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

అయితే బిగ్ బాస్ 12వ వారంలో భాగంగా రవి ఎలిమినేట్ కావడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా అతను ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులను ట్రోలింగ్ చేస్తున్నారు.