Tag Archives: Abortion

Tamannaah: పెళ్లి కాకుండానే తమన్నా ప్రెగ్నెంట్ అయిందా… వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్…. నిజమెంత?

Tamannaah: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి తమన్న ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నారని వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను తమన్నా ఖండించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం.

ఇలా ఇదివరకు తమన్నా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తమన్నా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో రహస్యంగా ప్రేమ ప్రయాణం సాగించారని అయితే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కూడా అయ్యారని తెలుస్తోంది.


Tamannaah:విభేదాల వల్ల అబార్షన్ చేయించుకున్నారా….

తమన్నాకు ఆ హీరోతో విభేదాలు రావడం చేత ఈమె తన నుంచి దూరంగా ఉండటమే కాకుండా అబార్షన్ కూడా చేయించుకున్నారని సమాచారం.ఇలా ఆ హీరోకి దూరంగా ఉన్నప్పటికీ ఆయనతో కలిసి సినిమాలు చేసే అవకాశాలు వస్తున్న తమన్నా అందుకు నో చెబుతూనే ఉన్నారట. ఇలా తమన్నా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

అఫైర్స్, అబార్షన్ రూమర్స్ పై స్పందించిన సమంత… అందరికీ థ్యాంక్స్ అంటూ..!

గత కొద్దిరోజుల నుంచి నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ వచ్చిన వార్తలు నిజమేనని నాగచైతన్య సమంత దంపతులు అధికారికంగా అక్టోబర్ 2వ తేదీ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ వార్తను విని అభిమానులు కొంతవరకు షాక్ కి గురైన సమంత విడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈక్రమంలోనే తనకి ఎవరితోనూ అఫైర్స్ ఉన్నాయని, తనకు సినిమా అవకాశాలు రావడం చేత పిల్లలు వద్దనుకుని అబార్షన్ చేయించుకుందని ఇది నచ్చని అక్కినేని కుటుంబం తనకు విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విధంగా సమంత గురించి వస్తున్న వార్తలపై తాజాగా సమంత స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన సమంత తనపై వస్తున్న ఎఫైర్స్, పిల్లలు వద్దనుకుంటున్నా అంటూ తనని ఒక అవకాశ వాదిగా చిత్రీకరించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకుల బాధ నుంచే తాను బయటపడలేక పోతుంటే తనపై ఇలా ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా మరింత బాధ పెట్టడం సరికాదని సమంత తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరు ఏమన్నా ఆ ప్రభావం తనపై పూర్తిగా పడిందని ఇలాంటి సమయంలో తనకు తోడుగా ఉన్న వారందరికీ థ్యాంక్స్ అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పుకొచ్చారు. మొత్తానికి విడాకుల తర్వాత వరుస పోస్టులతో స్పందించిన సమంత విడాకుల విషయంలో ఎంత బాధ పడుతుందనే విషయాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అబార్షన్ చేయించుకోవడం మన దేశంలో నేరమా? ఎందుకు?

సాధారణంగా మహిళల గర్భంలో పెరుగుతున్న పిండం బయటకు తొలగించడాన్ని గర్భస్రావం అంటారు. అయితే ఇది మానవ ప్రమేయం లేకుండా అదంతట అదే అబార్షన్ జరిగితే దానిని అబార్షన్ లేదా గర్భస్రావం అని అంటారు. మన దేశంలో దాదాపు 30 నుంచి 40 శాతం మహిళలు ఈ విధమైనటువంటి గర్భస్రావం ఎదుర్కొంటున్నారు. మానవ ప్రమేయం లేకుండా జరిగే దానిని గర్భస్రావం అంటారు.

కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా గర్భంలో పెరుగుతున్న టువంటి పిండాన్ని తొలగించడాన్ని ప్రేరేపిత గర్భస్రావం అంటారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. ఈ విధమైనటువంటి అబార్షన్ కొన్నిసార్లు మనదేశంలో చట్టపరంగా న్యాయమైనది అయితే కొన్నిసార్లు, చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.

గర్భంలో పెరుగుతున్న పిండం కొన్ని అనివార్య కారణాల వల్ల గర్భస్రావం జరిగితే ఆ పిండం తొలగించడం కోసం చేసే అబార్షన్ చట్టపరంగా న్యాయమైనదే. మరికొందరిలో పిండం ఎదుగుదలలో లోపాలు ఏర్పడినప్పుడు ఆ పిండాన్ని తొలగించడాన్ని న్యాయమైనదిగా భావిస్తారు. అయితే ఈ విధంగా కడుపులో పెరుగుతున్న బిడ్డను తొలగించడానికి కేవలం గర్భం మోస్తున్న మహిళా అనుమతి చాలు. అయితే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న వారికి,మతిస్థిమితం లేని వారికి అబార్షన్ చేయాలంటే తప్పనిసరిగా సంరక్షకుల అనుమతి అవసరం.

కొందరు మహిళలు లింగ వివక్షత వల్ల ముందుగానే అమ్మాయి అని తెలుసుకుని వారిని తొలగించాలని భావిస్తుంటారు. ఈ విధంగా అబార్షన్ చేసే వారిపై భారతదేశంలో నేరంగా భావించి పలు కేసులను నమోదు చేయవచ్చు. ఈ విధమైనటువంటి అబార్షన్ లను చేయటం మన దేశంలో చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.24 వారాల తర్వాత ఎటువంటి మహిళలలో అయినా అబార్షన్ జరిగితే వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అబార్షన్ అనేది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అలాంటప్పుడే తల్లి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది.