గత కొద్దిరోజుల నుంచి నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ వచ్చిన వార్తలు నిజమేనని నాగచైతన్య సమంత దంపతులు అధికారికంగా అక్టోబర్ 2వ తేదీ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ వార్తను విని అభిమానులు కొంతవరకు షాక్ కి గురైన సమంత విడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈక్రమంలోనే తనకి ఎవరితోనూ అఫైర్స్ ఉన్నాయని, తనకు సినిమా అవకాశాలు రావడం చేత పిల్లలు వద్దనుకుని అబార్షన్ చేయించుకుందని ఇది నచ్చని అక్కినేని కుటుంబం తనకు విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విధంగా సమంత గురించి వస్తున్న వార్తలపై తాజాగా సమంత స్పందించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన సమంత తనపై వస్తున్న ఎఫైర్స్, పిల్లలు వద్దనుకుంటున్నా అంటూ తనని ఒక అవకాశ వాదిగా చిత్రీకరించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకుల బాధ నుంచే తాను బయటపడలేక పోతుంటే తనపై ఇలా ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా మరింత బాధ పెట్టడం సరికాదని సమంత తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు ఏమన్నా ఆ ప్రభావం తనపై పూర్తిగా పడిందని ఇలాంటి సమయంలో తనకు తోడుగా ఉన్న వారందరికీ థ్యాంక్స్ అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పుకొచ్చారు. మొత్తానికి విడాకుల తర్వాత వరుస పోస్టులతో స్పందించిన సమంత విడాకుల విషయంలో ఎంత బాధ పడుతుందనే విషయాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…