వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వివాహం తరువాత కూడా కాజల్ అగర్వాల్ ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. అదేవిధంగా నాగార్జున ఘోస్ట్ సినిమాలో కూడా కాజల్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇవే కాకుండా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా .. ‘ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్..స్టే ట్యూన్‌డ్’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లకు పలు సందేహాలను కలిగిస్తోంది. కాజల్ అగర్వాల్ త్వరలోనే ఏం చెప్పాలనుకుంటుంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బహుశా ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారా అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందన్న విషయాన్ని చెబుతుందా లేకపోతే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తారో వేచిచూడాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…