Tag Archives: abroad

Nikesha Patel: కాబోయే భర్తను పరిచయం చేసిన నటి నికిషా పటేల్.. వైరల్ ఫోటో?

Nikesha Patel: నికిషా పటేల్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ సరసన కొమరం పులి సినిమాలో నటించిన హీరోయిన్ అంటే టక్కున ఆమె గుర్తుకు వస్తారు.కొమరం పులి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు.

ఈ విధంగా నికిషా పటేల్ తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ మలయాళ భాషలలో కూడా పలు సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.

ఇలా అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేశారు.ఇలా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని తెలియచేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనకు కాబోయే భర్త గురించి వివరాలు తెలుపమని తన ఫోటోలు పంపించమని కోరారు.బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొదటిసారి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Nikesha Patel: ఇక్కడ కుర్రాల పరిస్థితి ఏంటి…

ఈమె అబ్రాడ్ లో పెరగటం వల్ల అక్కడ వ్యక్తిని ప్రేమించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని వెల్లడించారు. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవి చూస్తున్న ఎంతోమందిని డిజైన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మీరు కూడా అబ్రాడ్ కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇండియాలో ఉన్న కుర్రాల పరిస్థితి ఏంటి అంటూ కొంటేగా కామెంట్లు పెడుతున్నారు.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

Quarantine: విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా రిస్క్ ఉన్న దేశాలు తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా ఆంక్షలు, క్వారంటైన్ రూల్స్ ని సడలించింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రాకపోకలు కొనసాగించే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం 14 స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. నిరంతరం మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ ని పర్యవేక్షించాలనే అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు..

ఓమిక్రాన్ మొదలైనప్పటి నుంచి కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి వచ్చేవారిని నిశితంగా గమనించింది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రయాణికులపై క్వారంటైన్ రూల్స్ విధించింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు ఊరట లభించింది.  కొత్తగా విధించిన మార్గదర్శకాల్లో విదేశీయులంతా తప్పనిసరిగా… 14 రోజుల ట్రావెల్ హిస్టరీని స్వీయ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించాలి. ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ పరీక్ష ఫలితాలను అప్ లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషణ్ ఫామ్ , నెగిటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ లైన్స్ బోర్డింగ్ కు అనుమతించనున్నారు.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

IPL 2022: దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితులను మరోసారి తలికిందులు చేసేలా కనిపిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు ఇలాంటి భయాల్ని కల్పిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ లో పనిచేసే సిబ్బందికి దాదాపు 300 మంది పైగా కోవిడ్ బారిన పడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు… కోవిడ్ థర్డ్ వేవ్ ఎంతలా విరుచుకుపడుతోంది.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

ఇలా దేశంలో ప్రతిరోజూ 1 లక్ష కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వేవ్ నుంచి తప్పించుకోవడానికి నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్లు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ కోవిడ్ వ్యాప్తి అనేది క్రికెట్ పై కూడా పడుతోంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లను కోవిడ్ కారణంగా రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది.

IPL 2022: మళ్లీ విదేశాలకు ఐపీఎల్ టోర్నమెంట్.. పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ..!

బీసీసీఐ ఇప్పటికే అనేక దేశీయ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.

కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున ..

రాబోయే నెలల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని బీసీసీఐ నమ్మకంగా ఉంది. అయితే పరిస్థితి మరింత దిగజారితే టోర్నమెంట్‌ను విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సాధ్యమైనంతగా ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ బీసీసీఐ టోర్నమెంట్‌ను విదేశాలకు మరిస్తే మాత్రం.. ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఐపీఎల్ నిర్వహించడం వరుసగా ఇది మూడో సారి అవుతుంది. ఐపీఎల్ 2020 మొత్తం సీజన్ యూఏఈలో జరిగింది. 2021లో కూడా కరోనా కారణంగా.. ఇండియాలో కేవలం 30 మ్యాచ్‌లను నిర్వహించగలిగింది. అంతే కాదు.. కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున టోర్నమెంట్‌ను మేలో వాయిదా వేయవలసి వచ్చింది. ఇలా ఐపీఎల్ మాత్రమే కాకుండా.. దుబాయ్ లో 2021 టీ20 వరల్డ్ కప్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హోమ్ సీజన్‌లో వెస్టిండీస్ , శ్రీలంకలకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీని తర్వాతనే ఐపిఎల్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.