Tag Archives: airtel

కరోనా వేళ.. ఎయిర్టెల్ సూపర్ ఆఫర్.. ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో ఎంతో మంది తమవంతు సహాయంగా ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తమ నెట్వర్క్ ఉపయోగిస్తున్న low income గ్రూప్‌కు చెందిన 5.5 కోట్ల కస్టమర్లకు లబ్ది చేకూర్చేలా ఎయిర్టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లో ఇన్కమ్ గ్రూప్ కి చెందిన కస్టమర్లకోసం రూ. 49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న ఈ దుర్భరమైన పరిస్థితులలో ప్రజల మధ్య అవసరమైన సమాచార మార్పిడి జరగడానికి వీలుగా ఎయిర్టెల్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అందిస్తున్న 49 రూపాయలు ప్యాక్ తో రూ. 38 టాక్‌టైమ్, 100 ఎంబీ ఉచిత డైటా 28 రోజుల కాల పరిమితితో అందిస్తున్నారు.

ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎయిర్టెల్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ. 79తో రీచార్జ్ చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్ టెల్ టెలికామ్ తీసుకున్న ఈ నిర్ణయం విలువ రూ. 270 కోట్లు ఈ సందర్భంగా ఎయిర్టెల్ సంస్థ పేర్కొంది.

మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న చార్జీలు..?

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు డేటా కోసం, ఇతర కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉండటంతో టెలీకం కంపెనీలకు లాభం చేకూరుతోంది.

అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జియో రాకతో టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కస్టమర్లకు కాల్స్ ఛార్జీలు, డేటా ఛార్జీలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే మొదట్లో తక్కువ ధరలకే సర్వీసులు అందించిన జియో తర్వాత కాలంలో కాల్, డేటా ఛార్జీలను పెంచింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కంపెనీలు త్వరలోనే మరోసారి ఛార్జీలను పెంచనున్నాయి.

మొబైల్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2021 జనవరి నెల నుంచి టారిఫ్ చార్జీలు 15 నుంకి 20 శాం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జియో మినహా మిగతా కంపెనీలన్నీ పెంచవచ్చని..అయితే జియో టారిఫ్ ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నెలలో మొబైల్ కంపెనీలు టారిఫ్ చార్జీలను భారీగా పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ ‌టెల్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఛార్జీల పెంపు అమలైతే వినియోగదారులు తీవంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. ఫ్రీగా 50 జీబీ డేటా..?

దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ ఈ మధ్య కాలంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడానికి కీలక ప్రకటనలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు ఉచితంగా 50 జీబీ అందించడానికి సిద్ధమైంది. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులకు అంగీకరించిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులవుతారు.

ఎయిర్ టెల్ ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి 4జీ హ్యాండ్ సెట్ కు మారిపోతారో వారికి మాత్రమే 50 జీబీ డేటా ద్వారా ప్రయోజనం కలిగేలా చేస్తోంది. ఫీచర్ ఫోన్ నుంచి 4జీ ఫోన్ కు మారిన కస్టమర్లు ఐదు అన్ లిమిటెడ్ రీఛార్జీలు చేసుకుని ఈ డేటా ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులవుతారు. ఒక అన్ లిమిటెడ్ రీఛార్జ్ కు 10జీబీ డేటా చొప్పున ఐదు అన్ లిమిటెడ్ రీఛార్జీలకు 50జీబీ డేటాను పొందవచ్చు.

సాధారణంగా పండుగ సమయాల్లో చాలామంది కస్టమర్లు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులవుతారు. అప్ గ్రేడ్ అయ్యే కస్టమర్లు ఓటీటీ బండిల్ ఆఫర్స్, హైస్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ ను పొందవచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది.

టెలీకాం రంగంలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం వన్ ఎయిర్ టెల్ ప్లాన్స్ ను కూడా అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. వన్ ఎయిర్ టెల్ ప్లాన్స్ ను రీచార్జ్ చేసుకుంటే మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్, డీటీహెచ్ సర్వీసులను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. లోన్ ఇస్తున్న ఎయిర్‌టెల్!

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేటికీ కొన్ని కారణాల వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ శుభవార్త చెప్పింది. జీరో కాస్ట్ లోన్ పేరుతో ఎయిర్ టెల్ 2జీ వినియోగదారులు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి లోన్ ఇస్తోంది. ఐడీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఎయిర్ టెల్ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.

ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ కొనాలకునేవారికి ఇచ్చే ఫోన్ ధర 6,800 రూపాయలు కాగా బ్యాంక్ డౌన్ పేమెంట్ 3,259 రూపాయలు లోన్ గా పొందవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు 603 రూపాయలు ఈఎంఐ రూపంలో నెలనెలా చెల్లించాలి. ఈఎంఐ కాలపరిమితి పది నెలలు కాగా వినియోగదారుని మొబైల్ టారిఫ్ ప్లాన్ ను కూడా ఎయిర్ టెల్ ఇందులోనే కట్ చేసుకుంటుంది. మొబైల్ తీసుకున్న రోజు నుంచి పది నెలలు కస్టమర్లు రీఛార్జి చేయించుకోవాల్సిన అవసరం లేదు.

మొత్తంగా వినియోగదారుడు ఫోన్ కోసం 9,289 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్ కాస్ట్ తో పోలిస్తే తక్కువ ధరకే మొబైల్ ను అందిస్తున్నామని.. ఈ మొబైల్ వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఎయిర్ టెల్ చెబుతోంది. కేవలం 2 నెలలు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. మరోవైపు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌ను 200కు పైగా డివైజ్ లను అందిస్తోంది.

వినియోగదారులు సిగ్నల్ సమస్యలు ఏర్పడితే వైఫై ద్వారా వాయిస్ కాల్స్ ను మాట్లాడుకోవచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలలో సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.