ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో ఎంతో మంది తమవంతు సహాయంగా ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తమ నెట్వర్క్ ఉపయోగిస్తున్న low income గ్రూప్‌కు చెందిన 5.5 కోట్ల కస్టమర్లకు లబ్ది చేకూర్చేలా ఎయిర్టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లో ఇన్కమ్ గ్రూప్ కి చెందిన కస్టమర్లకోసం రూ. 49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్టు ఆదివారం ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న ఈ దుర్భరమైన పరిస్థితులలో ప్రజల మధ్య అవసరమైన సమాచార మార్పిడి జరగడానికి వీలుగా ఎయిర్టెల్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్ అందిస్తున్న 49 రూపాయలు ప్యాక్ తో రూ. 38 టాక్‌టైమ్, 100 ఎంబీ ఉచిత డైటా 28 రోజుల కాల పరిమితితో అందిస్తున్నారు.
ఎయిర్టెల్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎయిర్టెల్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రూ. 79తో రీచార్జ్ చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్ టెల్ టెలికామ్ తీసుకున్న ఈ నిర్ణయం విలువ రూ. 270 కోట్లు ఈ సందర్భంగా ఎయిర్టెల్ సంస్థ పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…