పెళ్లయి భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంలోకి పెను తుఫానులా ఓ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి రాకతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. వచ్చిన వ్యక్తితో సదరు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను వదిలిపెట్టి, కన్నబిడ్డను కానరాని లోకాలకు పంపించిన ఘటన రాజస్తాన్‌లో జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జైపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుమిత్ అహీర్, టీనా దంపతులకు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. టీనా అనుకోకుండా ఫోన్ ద్వారా ప్రహ్లాద్(45) అనే వ్యక్తికి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే టీనా తన భర్తను వదిలి తన కూతుర్ని తీసుకుని ప్రియుడితో వెళ్లి పోయింది.
టీనా తన ప్రియుడితో కలిసి జైపూర్ రూరల్ పరిధిలోని ఉదవల గ్రామంలో నివసిస్తుంది. ఈ క్రమంలోనే టీనా భర్త తన భార్య పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు . ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆచూకీని గుర్తించారు. కానీ తన కూతురి ఆచూకీ మాత్రం తెలియడం లేదు.
తన కూతురు గురించి టీనాని ప్రశ్నించగా బంధువుల ఇంట్లో ఉందని చెప్పింది.ఇదే విషయం గురించి పోలీసులు ఆరా తీయగా పాప అక్కడ లేదని తెలియడంతో ఆమెను గట్టిగా మందలించడంతో అసలు విషయం బయట పెట్టింది. తన కూతురు ఆరోగ్యం బాగా లేకపోతే తనకు వైద్యం చేయించడానికి తన ప్రియుడు డబ్బులు ఇవ్వక పోవడంతో అతనితో కలిసి తన నాలుగు సంవత్సరాల కూతురిని గొంతు నులిమి చంపినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు టీనా ఆమె ప్రియుడు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…