వేసవికాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోతాయి. ఈ క్రమంలోనే చాలామంది ఏసీలు కొనాలనుకుంటారు. ఈ క్రమంలోనే వేసవి కాలంలో పెద్ద ఎత్తున ఏసీలను కొనుగోలు చేస్తుంటారు.అయితే ఏసీలు కొనాలనుకునేవారు ముందుగా ఏసీల గురించి కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.
ఎవరైతే ఏసీ లను కొనాలనుకుంటున్నారో వారు ముందుగా వారి రూమ్ సైజు, ఏసీ సైజు, కెపాసిటీ, ఎనర్జీ రేటింగ్ అన్న విషయాలను ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ లలో ఎన్నో రకాలు ఉంటాయి. విండో ఏసి, సెంట్రల్ ఏసి, స్ప్లిట్ ఏసి, వంటి రకాలు ఉన్నాయి.అయితే చాలామంది ఇళ్లల్లో కి ఎక్కువగా విండో ఏసీ లేదా స్ప్లిట్ ఏసీ లను ఉపయోగిస్తారు.
ఓకే రూమ్ కు ఏసీ కావాలనుకునేవారు విండో ఏసి తీసుకోవచ్చు. స్ప్లిట్ ఏసి కన్నా విండో ఏసి లను ఎంతో సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఏసీ వేసుకోవాలనే గది కిటికీ ఉంటే విండో ఏసి ఎంతో మంచిది. స్ప్లిట్ ఏసి అయితే ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండటమే కాకుండా రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి బయట మరొకటి లోపల పెట్టుకోవాలి.
ఏసీల కెపాసిటీ లను టన్నులలో కొలుస్తారు. మన రూమ్ సైజును బట్టి ఏసీ కెపాసిటీని తీసుకోవాలి. రూమ్ సైజు చిన్నగా ఉంటే ఒక టన్ను కెపాసిటీ సరిపోతుంది. చాలామంది ఏసీ కొంటె ఎక్కువ కరెంటు ఖర్చవుతుందని భావిస్తుంటారు. కరెంటు ఖర్చు తక్కువగా రావాలంటే మనం 5 స్టార్ ఏసీలనే కొనాలి. విండో ఏసి ధర 17 వేల నుంచి ప్రారంభం కాగా, స్ప్లిట్ ఏసి లు 21 నుంచి మొదలవుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…