సాధారణంగా ఒక కల్యాణ మండపంలో ఒక వ్యక్తి ఒక అమ్మాయికి మాత్రమే తాళి కట్టి పెళ్లి చేసుకోవడం మనం ఇదివరకు చూశాం. ఒకవేళ వారి వివాహ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనల వల్ల వారిరువురు మరొక వివాహం చేసుకోవడం వంటి సంఘటనలను గురించి విన్నాము కానీ, ఒక వ్యక్తి ఓకే కల్యాణ మండపంలో ఓకే ముహూర్తంలో ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని కొల్లార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..తిమ్మరవుతనహల్లి గ్రామంలోని వెగమడుగుకు చెందిన సుప్రియ, లలిత ఇద్దరు అక్కచెల్లెళ్ళు. అయితే ఈ అక్క చెల్లెలు ఇద్దరు దివ్యాంగులు. అక్క సుప్రియ మూగ కాగా, చెల్లెలు లలితకు చెవులు వినిపించవు. అయితే దివ్యాంగులు అయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను తమ వరసకు మావయ్యా అయినా ఉమాపతికి ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు.
ఈ క్రమంలోనే మే 7వ తేదీన తిమ్మరవుతనహల్లిలో వీరి వివాహం ఎంతో వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతూ తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…