General News

ప్రపంచ అతి పొడవైన వేలాడే బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా?

మీకు సాహసాలు చేయడం అంటే ఇష్టమా? కొందరు ఎంతో భయంకరమైన సాహసాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగా సాహసాలు చేసే వారికి ఈ బ్రిడ్జ్ ఎంతో అనువైనదని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతి భయంకరమైన, అతి పొడవైన పెడెస్ట్రెయిన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి ఇది.ఈ బ్రిడ్జ్ ను పోర్చుగల్‌లో ప్రారంభించారు.

పెడెస్ట్రెయిన్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జ్ ను ఇటీవలే ప్రారంభించారు. వేలాడే బ్రిడ్జ్ ఏకంగా 1700 అడుగులు పొడవు,575 అడుగుల ఎత్తులో నిర్మించి ఉంది.ఇంత ఎత్తైన పొడవైన బ్రిడ్జి కేవలం నడవడానికి మాత్రమే అక్కడి ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్రిడ్జి మొత్తం ఇనుప తీగలతో నిర్మించబడి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది.

రెండు కొండల మధ్య ప్రవహించే పైవా నది ఉపరితలం పై
అరౌకా జియో పార్క్‌ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. 1700 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జి పై ఆ చివరి నుంచి చివరి వరకు నడిచి రావాలంటే సుమారు పది నిమిషాల సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ బ్రిడ్జిపై నడిచేటప్పుడు పొరపాటున కిందికి చూస్తే భయం వేస్తుందని. అన్ని అడుగుల ఎత్తులో ఉన్న ఈ వేలాడే బ్రిడ్జిపై నడవాలంటే ఎంతో గుండె ధైర్యం, సాహసం చేయాలనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago