మీకు సాహసాలు చేయడం అంటే ఇష్టమా? కొందరు ఎంతో భయంకరమైన సాహసాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగా సాహసాలు చేసే వారికి ఈ బ్రిడ్జ్ ఎంతో అనువైనదని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతి భయంకరమైన, అతి పొడవైన పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇది.ఈ బ్రిడ్జ్ ను పోర్చుగల్‌లో ప్రారంభించారు.

పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ను ఇటీవలే ప్రారంభించారు. వేలాడే బ్రిడ్జ్ ఏకంగా 1700 అడుగులు పొడవు,575 అడుగుల ఎత్తులో నిర్మించి ఉంది.ఇంత ఎత్తైన పొడవైన బ్రిడ్జి కేవలం నడవడానికి మాత్రమే అక్కడి ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్రిడ్జి మొత్తం ఇనుప తీగలతో నిర్మించబడి ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది.
రెండు కొండల మధ్య ప్రవహించే పైవా నది ఉపరితలం పై
అరౌకా జియో పార్క్ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. 1700 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జి పై ఆ చివరి నుంచి చివరి వరకు నడిచి రావాలంటే సుమారు పది నిమిషాల సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఈ బ్రిడ్జిపై నడిచేటప్పుడు పొరపాటున కిందికి చూస్తే భయం వేస్తుందని. అన్ని అడుగుల ఎత్తులో ఉన్న ఈ వేలాడే బ్రిడ్జిపై నడవాలంటే ఎంతో గుండె ధైర్యం, సాహసం చేయాలనే చెప్పాలి.