Tag Archives: ap cm ys jagan

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాల అమలులో భాగంగా అమ్మఒడి స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ గతేడాది జనవరి నెల 9వ తేదీన అమ్మఒడి స్కీమ్ లో భాగంగా 15,000 రుపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసింది. ఈ ఏడాది 14,000 రూపాయలు ప్రభుత్వం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమైంది.. నేడు జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని జమ చేసింది.

అయితే సీఎం జగన్ నేడు అమ్మఒడి స్కీమ్ అమలు కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ డబ్బులు వద్దని అనుకునే వాళ్లు ల్యాప్ ట్యాప్ ను తీసుకోవచ్చని జగన్ కీలక ప్రకటన చేశారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ చదివే వసతి దీవెన లబ్ధిదారులు ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రెండో విడత చెల్లింపులను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తున్నామని.. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. చదువుకునే వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ బడికి వెళ్లాలని.. పేదింటి పిల్లలకు మేనమామలా వాళ్లు చదువుకు దూరం కాకుండా ఆదుకుంటానని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి కూడా సీఎం జగన్ స్పందించారు.

తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని.. ఆలయ భూములను కాజేసిన వాళ్లు, గుడుల్లో క్షుద్రపూజలు చేసిన వాళ్లు ఇప్పుడు కొత్త వేషాలు కడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలు చేసే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు.. షాక్ లో పవన్ ఫ్యాన్స్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నాగబాబు ప్రశంసించడం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖల నుంచి జగన్ కు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సినీ రంగం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కరోనా వల్ల నష్టపోయిన సినీ పరిశ్రమకు భారీగా రాయితీలను ప్రకటించారు.

జగన్ రాయితీలను ప్రకటించడంపై నాగబాబు స్పందిస్తూ జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో శూన్యం ఏర్పడిందని జగన్ తన నిర్ణయం ద్వారా శూన్యాన్ని పూఢ్చేశారని వెల్లడించారు. జగన్ సర్కార్ చొరవ తీసుకోవడం వల్ల సినిమా రంగానికి జవసత్వాలు చేకూరుతాయని నాగబాబు అన్నారు.

సీఎం జగన్ రాయితీల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతిస్తోందని నాగబాబు అన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో సీఎం జగన్ ఆదుకున్నారని నాగబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్‌ నెలల చార్జీలను రద్దు చేయడంతో జగన్ సర్కార్ పై అదనంగా 3 కోట్ల రూపాయల భారం పడనుంది.

అయితే నాగబాబు జగన్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. నాగబాబు జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని కామెంట్లు చేస్తారు. జగన్ కు అనుకూలంగా ట్వీట్ చేసి నాగబాబు పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.