Tag Archives: AP Skill Development Corporation

ఏపీ నుంచి ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. !

ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) నుంచి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వివిధ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే నేడే చివరి తేదీ. అంటే జూలై 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మొత్తం 108 ఖాళీలు ఉండగా అందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 42 ఉన్నాయి. దీనికి పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి అంతే కాకుండా దీనికి ఎంపిక అయిన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేన్లో పేర్కొన్నారు.

డెలివరీ కన్‌సల్టెంట్‌ విభాగంలో 66 ఖాళీలు ఉండగా.. దీనికి కూడా పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు జాబ్ శిక్షణ ఉంటుంది.

ఎంపికైన వారు తప్పనిసరిగా భట్టిప్రోలు, సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, నిజాంపట్నం, సత్తెనపల్లి, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివరాలకు 9182280707 నంబర్ కు సంప్రదించండి. అప్లై చేసుకునే ప్రతీ ఒక్కరికీ టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉండాలని తెలిపారు.

నిరుద్యోగులకు శుభవార్త.. 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 200 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2016 నుంచి 2020 లోపు బీఎస్సీ కెమిస్ట్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.apssdc.in/ ద్వారా ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలరోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. బీఎస్సీ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ప్రొడక్షన్ అలవెన్స్, ప్రొడక్షన్‌ ఎక్స్‌పెన్స్, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ కింద మొత్తం 16,800 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తివివరాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ ఉద్యోగులకు అనుభవాన్ని బట్టి వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.