ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. వివిధ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తూ ఉంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే నేడే చివరి తేదీ. అంటే జూలై 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2న ఉదయం 10 గంటలకు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మొత్తం 108 ఖాళీలు ఉండగా అందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 42 ఉన్నాయి. దీనికి పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి అంతే కాకుండా దీనికి ఎంపిక అయిన వారికి నెలకు రూ. 11 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం ఉంటుందని నోటిఫికేన్లో పేర్కొన్నారు.
డెలివరీ కన్‌సల్టెంట్ విభాగంలో 66 ఖాళీలు ఉండగా.. దీనికి కూడా పది, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 15 రోజుల పాటు జాబ్ శిక్షణ ఉంటుంది.
ఎంపికైన వారు తప్పనిసరిగా భట్టిప్రోలు, సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, నిజాంపట్నం, సత్తెనపల్లి, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివరాలకు 9182280707 నంబర్ కు సంప్రదించండి. అప్లై చేసుకునే ప్రతీ ఒక్కరికీ టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ ఉండాలని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…