టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక హీరోయిన్ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ఇంత చిన్న వయసుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పలు వీడియోల ద్వారా అభిమానులను అలరిస్తూ ఉంటారు.
సితారకు సంబంధించిన ఏ చిన్న ఫోటో, వీడియో అయినా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంటాయి.
ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాలో ఎన్నో పాటలకు డాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను యూ ట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా సితార పెయింటింగ్స్ ఎలా వేయాలి అనే పాఠాలను నేర్పుతుంది. ఈ వీడియో ద్వారా
స్కై పెయింటింగ్ ఎలా వేయాలన్న విషయాన్ని చెప్పడమే కాకుండా వీక్షకుల కోసం చేసి చూపించింది.
ప్రస్తుతం సితార షేర్ చేసిన ఈ పెయింటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మహేష్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇంత చిన్న వయసులోనే సితార టాలెంట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్నారు.ఇప్పటికే రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని చిత్ర బృందం తెలిపారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జోడి కట్టారు.
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…
వంటగదిలో ఉపయోగించే పాత్రల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడిప్పుడే ఎక్కువగా చర్చకు వస్తోంది. గతంలో నుంచి అల్యూమినియం…
ఉదయం లేవగానే ఒక కప్పు టీ, దానితో పాటు రెండు బిస్కెట్లు—ఇది చాలా మందికి రోజువారీ అలవాటు. సాయంత్రం టైంలో…
నేటి జీవనశైలిలో మార్పులు, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా…