అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. అవి మన రెప్పపాటు కాలంలో జరిగిపోతుంటాయి. ఇలంటిదే ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. పురాతన కాలంలో కట్టిన వాటర్ ట్యాంక్ నీటి సరఫరాకు ఉపయోగిస్తున్నారు. ఆ ట్యాంక్ ద్వారానే ఆ గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పడు అది శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీనిని అధికారులు గుర్తించలేకపోయారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఆ శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా నేల మట్టం అయ్యింది. అదృష్టం ఎంటంటే ఆ వాటర్ ట్యాంకు కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేరు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈ సీసీ కెమెరాలో రాకార్డు అయిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ గా మారింది.
ఆ వాటర్ ట్యాంక్ అంతా కిందపడిపోవడంతో నీళ్లన్నీ ఆ సమీపాన ఉన్న గ్రామస్తుల ఇళ్ల వరకు చేరాయి. ఆ ప్రాంతమంతా జలమయం అయిపోయింది. అయితే.. అధికారుల నిర్లక్ష్యంతోనే ట్యాంకు నేలమట్టమైందని, పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 1.5 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ 40 ఏళ్ల క్రితం నాటిదని గ్రామస్థులు వెల్లడించారు. ఉదయం.. సాయంత్రం సమయంలో ఎక్కువగా నీళ్ల కోసం ట్యాంక్ వద్దకు వెళ్తామని.. మిగతా సమయంలో అక్కడ వెళ్లమని.. అయితే మధ్యాహ్నం సమయంలో ఇలా జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు.
ఈ ఘటన గుజరాత్ జునాఘడ్‌లోని కేశోద్ ప్రాంతం ఖీర్సారా గ్రామంలో చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా 2019 లో ఇలానే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వాటర్ ట్యాంక్ కూలి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…