కరోనా వైరస్ మహమ్మారి సమయంలో.. వీధి వ్యాపారస్తులు ఎక్కువగా వైరస్ కాటుకి బలైపోయారు. లాక్‌డౌన్ సమయంలో వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పీఎం స్వనిధి పథకం కింద వారంతా తమ సొంత వ్యాపారం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యూపారుల ఆత్మ నిర్భర నిధి (PM Street Vendor’s AtmaNirbhar Nidhi( PM SVANidh i) కింద రుణాలు పంపిణీ చేస్తున్నారు.
రూ.10,000 వరకు రుణాన్ని సులభంగానే పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌ను 2020జూన్ 1న ఆత్మ నిర్భర్ నిధి పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించిన ప్రధాని… వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రుణ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ పథకం వల్ల ప్రయోజనాలను వారికి వివరించారు. కరోనా వల్ల తాము ఎంతలా నష్టపోయింది… వీధి వ్యాపారులు ప్రధాని మోదీకి వివరించారు. ఈ పథకం తమకు ఎంతో మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
జూలై 26, 2021 నాటికి 43.1 లక్షల రుణ దఖాస్తులు రాగా, వీటిలో 25.2 లక్షల రుణాలు మంజూరు కాగా, అందులో రూ. 2,243 కోట్ల రుణాలు 22.7 లక్షల మందికి పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఈ పథకం కోసం రూ.5000 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ రుణం కోసం, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల రసీద లేదా చెల్లింపుపై కూడా నెలవారీ క్యాష్‌బ్యాక్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అసలు స్వనిధి పథకం అంటే ఏంటంటే.. రోడ్ సైట్ బండి లేదా వీధి రహదారిపై దుకాణాలను నడిపే వారికి ఇది వర్తిస్తుంది.
పండ్లు-కూరగాయలు, లాండ్రీ, సెలూన్, పాన్ షాపులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీని ద్వారా దాదాపు 50 లక్షల మందికి ప్రయోజనం చేకురనుంది. దీని ద్వారా ప్రతీ ఒక్క వ్యాపారి రూ.10000 వేలు రుణం తీసుకోవచ్చు. దీనిని ఒక సంవత్సరం లోపు చెల్లించాలి. ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. అంతేకాకుండా వడ్డీని సకాలంలో చెల్లిస్తూ ఉంటే.. 7% వార్షిక వడ్డీ రాయితీ కూడా ఉంటుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…