Tag Archives: ar rahman

Kasturi Shankar: రెహమాన్ భార్యపై షాకింగ్ కామెంట్ చేసిన కస్తూరి శంకర్… అదిరిపోయే రిప్లై ఇచ్చిన రెహమాన్!

Kasturi Shankar: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో కలిసి తాజాగా తమిళనాడులో జరిగిన ఒక అవార్డు వేడుకలలో పాల్గొన్నారు. ఈ అవార్డు వేడుకలలో భాగంగా యాంకర్ సైరా బానునీ సైతం వేదిక పైకి వచ్చి మాట్లాడమని యాంకర్ తెలియచేశారు. ఈ క్రమంలోనే సైరా బాను వేదిక పైకి వచ్చారు.

ఇక ఈమె మాట్లాడుతున్న సమయంలో ఏఆర్ రెహమాన్ హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడమని సూచించగా… ఆమె తనకు తమిళం రాదని ఇంగ్లీషులో మాట్లాడారు.ఇలా ఇంగ్లీషులో మాట్లాడటంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై కొందరు ఏఆర్ రెహమాన్ ను ట్రోల్ చేశారు. మీ భార్యకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేరా అంటూ మండిపడ్డారు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటి కస్తూరి శంకర్ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి శంకర్ తాజాగా రెహమాన్ భార్య మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఏంటి మీకు తమిళం మాట్లాడటం రాదా…మీరు మీ ఫ్యామిలీతో ఏ భాషలో మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు.

Kasturi Shankar: ప్రేమకు భాష లేదు…

ఇలా కస్తూరి శంకర్ ఈ పోస్ట్ చేయడంతో ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ప్రేమకు భాష లేదు అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా ఏఆర్ రెహమాన్ ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడంతో ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలికారనే తెలుస్తోంది.ఏది ఏమైనా ఏఆర్ రెహమాన్ భార్య మాట్లాడిన మాటల పట్ల కస్తూరి శంకర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

AR Rahman: అర్హత లేని సినిమాలను ఆస్కార్ కి పంపుతున్నారు… రెహమాన్ కామెంట్స్ వైరల్!

AR Rahman: చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డులను ప్రకటించినప్పటికీ ఆస్కార్ అవార్డు ఎంతో విలువైనది ప్రతిష్టాత్మమైనదిగా భావిస్తారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆస్కార్ అవార్డు అందుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.

ఇలా ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తరుణంలో రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డుల గురించి మాట్లాడుతూ…ఆస్కార్ అవార్డుల కోసం అర్హత లేనటువంటి సినిమాలను కూడా పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ సినిమా ఆస్కార్ కి తప్పనిసరిగా వెళ్తుంది అనుకుంటాను కానీ ఆ సినిమా మాత్రం వెళ్లదు. ఆ సమయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఈయన తెలిపారు.

AR Rahman: నామినేషన్స్ లో కూడా నిలవలేదు…

ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లేకపోయినా ఎలాగలాగో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి అవార్డు అందుకుంది. ఈ క్రమంలోనే రెహమాన్ అర్హత లేని సినిమాలను పంపిస్తున్నారు అనడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లేకపోయినా గుజరాత్ సినిమా ‘ఛెల్లో షో’ని పంపించారు. అది కనీసం నామినేషన్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు రెహమాన్ చేసిన ఈ కామెంట్స్.. ఈ సినిమాను ఉద్దేశించే మాట్లాడారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెహమాన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sandhya Raju: కూచిపూడి నాట్యకారిణి సంధ్య రాజు పై ప్రశంసలు కురిపించిన రెహమాన్!

Sandhya Raju: నాట్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కూచిపూడి నాట్యకారిణిని సంధ్య రాజు గురించి అందరికీ తెలిసిందే. క్లాసికల్ డాన్సర్ గా అందరికీ సుపరిచితమైన సంధ్య రాజు ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేశారు. అందరికీ ఎంతో సుపరిచితమైన సత్యం లింగరాజు రెండవ కోడలే సంధ్యా రాజు.కూచిపూడి నాట్య కళాకారిణిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నాట్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

Sandhya Raju: కూచిపూడి నాట్యకారిణి సంధ్య రాజు పై ప్రశంసలు కురిపించిన రెహమాన్!

నాట్యం సినిమాతో తన అద్భుతమైన నాట్య ప్రదర్శనల ద్వారా ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసి సంధ్య రాజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ రచయిత ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం ఫినామినల్ ఉమెన్ అనే పద్యానికి సంధ్య రాజు మోడ్రన్ క్లాసికల్ ఫర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Sandhya Raju: కూచిపూడి నాట్యకారిణి సంధ్య రాజు పై ప్రశంసలు కురిపించిన రెహమాన్!

సంధ్య రాజుపై ఏఆర్ రెహ్మాన్ ప్రశంసలు..

అద్భుతమైన క్లాసికల్ ఫర్ఫార్మెన్స్ పై ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా మూడు లక్షల వ్యూస్ సాధించుకుని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ఈ అద్భుతమైన క్లాసికల్ డాన్స్ ఫర్ఫార్మెన్స్ పై ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈ డాన్స్ వీడియోని రెహమాన్ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ… నటి సంధ్య క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇలా ఒక తెలుగు అమ్మాయి తన నాట్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందటం ఎంతో గర్వించదగ్గ విషయం.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

AR Rahman: ఏ ఆర్ రెహమాన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఈ ఆస్కార్ గ్రహీత. తమిళ ఇండస్ట్రీలో మొదలైన రెహమాన్ సంగీత ఝరి విశ్వ వ్యాప్తం అయింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ కూడా అందుకున్న విషయం మనకు తెలసిందే.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

అయితే తాజాగా ఏ ఆర్ రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే రెహమాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. చెన్నైలో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెహమాన్ కూతురు ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలుస్తోంది.

AR Rahman: ఘనంగా ఏఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా..?

అయితే ఖతీజా తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఆడియో, వ్యాపారవేత్త అయిన రియాసిద్దీన్‌ షేక్‌ మహ్మద్‌తో త్వరలో ఆమె నిఖా జరగనుంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖతీజా పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి. 

ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు ..

ఏఆర్ రెహమాన్ కు ఇద్దరు కూమార్తెలు కాగా… ఒక కుమారుడు ఉన్నాడు. ఖతీజా పెద్ద కూతురు కాగా చిన్నకూతురు పేరు రహీమా, కుమారుడి పేరు అమీన్ రెహ్మాన్. ఖతీజా సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో రోబో సినిమాలో ’ మర మనిషి‘ పాటను పాడింది.  ఆ తరువాత ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. మరో కుమార్తె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. అందుకు తగ్గట్లు నటనలో శిక్షణ తీసుకుంటుంది.

రజనీకాంత్ తో నరకం అనుభవించా.. ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు..

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో అవార్డులను స్వీకరించారు. ఆస్కార్ అవార్డును సైతం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అతడు ఎక్కువగా రజనీకాంత్ సినిమాలకు సంగీతం వహించాడు. ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 ఇలా కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించాడు రెహ్మాన్.

అయితే ఓ ఇంటర్వ్యూలో అతడు రజనీకాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రజనీకాంత్ సినిమాల్లో పని చేసేసమయంలో నరకంగా అనిపించేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రజనీకాంత్ తో కలిసి పనిచేసిన కొన్ని విషయాలను ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు రెహమాన్. రజనీకాంత్ సినిమాలకు మ్యూజిక్ అందించే సందర్భంలో వేరే సినిమాలకు కూడా ఒప్పుకునే వాడిని అని.. పండగల సందర్భంలోనే సినిమాలను విడుదల చేయాలని వారంతా అనుకోవడంతో ఒత్తిడికి లోనయ్యే వాడిని అంటూ చెప్పాడు.

అందుకే పండగలంటే.. అప్పట్లో ఇబ్బంది పడేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. మంచి అవుట్ పుట్ కోసం సమయం ఎక్కువగా తీసుకునే వాడిని అని.. మార్చిలో మొదలుపెడితే.. సాంగ్స్, బీజీఎం, కంపోజింగ్ కు ఎక్కువ సమయం పట్టేదని చెప్పాడు. ఇలాదీపావళికి ఫినష్ చేసేవాడని అని చెప్పాడు.

అతడి సినిమాలు ఎక్కువగా దీపావళి సందర్భంగానే వస్తాయి.. ఆ సమయంలోనే తాను ఒప్పుకున్న మరో సినిమాలు కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేయడంతో ఇటు.. అటు మ్యూజిక్ కంపోజింగ్ లో ఇబ్బంది పడేవాడిని అంటూ చెప్పాడు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదంటూ స్పష్టం చేశాడు.

ఏఆర్ రెహమాన్ సంగీతంలో.. తెలంగాణ బతుకమ్మ పాట..!

బతుకమ్మ పండగ వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలను కంపోజ్ చేసి.. య్యూట్యూబ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందులో వీ6 లో వచ్చే బతుకమ్మ పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీనిలో వచ్చిన పాటలు అంతకముందు బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. అదొక్కటే కాదు తెలుగు మీడియా ఛానల్లు అన్నీ ఇలా చేసినవే.

ఎవరి ఇష్టాలకు వాళ్లు పాటలను విడుదల చేస్తూ పండగపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ సారి మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. అదేంటంటే.. మన మ్యూజిక్ డైరెక్టర్లలో చెప్పుకోదగిన.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఏ.ఆర్ రెహమాన్. అతడు ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా. అతడి సంగీతంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ పాటను రూపొందించారు. త్వరలోనే బతుకమ్మ పాటను విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతున్నది.

ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉన్నదని, దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాయగా ప్రముఖ గాయకుడు ఉన్నిక్రిష్ణన్ పాడారు.

ఈ పాటను గత నెల 29, 30 తేదీల్లో తెలంగాణలోని యాదాద్రీ భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో షూట్‌ చేసినట్టు సమాచారం. మొత్తం పాటను నాలుగు నిమిషాల నిడివిగల వీడియోతో రూపొందించారు. ఈ బతుకమ్మ పాటను బతుకమ్మ పండగ రోజైన అక్టోబర్ 5న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారట.