Movie News

ఏఆర్ రెహమాన్ సంగీతంలో.. తెలంగాణ బతుకమ్మ పాట..!

బతుకమ్మ పండగ వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పాటలను కంపోజ్ చేసి.. య్యూట్యూబ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందులో వీ6 లో వచ్చే బతుకమ్మ పాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీనిలో వచ్చిన పాటలు అంతకముందు బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. అదొక్కటే కాదు తెలుగు మీడియా ఛానల్లు అన్నీ ఇలా చేసినవే.

ఎవరి ఇష్టాలకు వాళ్లు పాటలను విడుదల చేస్తూ పండగపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ సారి మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. అదేంటంటే.. మన మ్యూజిక్ డైరెక్టర్లలో చెప్పుకోదగిన.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఏ.ఆర్ రెహమాన్. అతడు ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా. అతడి సంగీతంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ పాటను రూపొందించారు. త్వరలోనే బతుకమ్మ పాటను విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతున్నది.

ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉన్నదని, దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాయగా ప్రముఖ గాయకుడు ఉన్నిక్రిష్ణన్ పాడారు.

ఈ పాటను గత నెల 29, 30 తేదీల్లో తెలంగాణలోని యాదాద్రీ భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో షూట్‌ చేసినట్టు సమాచారం. మొత్తం పాటను నాలుగు నిమిషాల నిడివిగల వీడియోతో రూపొందించారు. ఈ బతుకమ్మ పాటను బతుకమ్మ పండగ రోజైన అక్టోబర్ 5న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

2 hours ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

3 hours ago

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

3 hours ago

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

15 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

15 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

15 hours ago