Tag Archives: attacked

Big Boss Sunny: బిగ్ బాస్ సన్నీ పై దాడి చేసిన రౌడీ షీటర్.. అలర్ట్ అయిన సిబ్బంది!

Big Boss Sunny: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా ఎంపికై చివరికి విజేతగా నిలిచిన సన్నీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ఈయన పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు.

Big Boss Sunny: బిగ్ బాస్ సన్నీ పై దాడి చేసిన రౌడీ షీటర్.. అలర్ట్ అయిన సిబ్బంది!

ఇకపోతే తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం సన్నీ మరియు చిత్ర బృందం హైదరాబాద్లోని హస్తినాపురం ప్రాంతంలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రౌడీషీటర్ ఉన్నఫలంగా సన్నీ పై దాడికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం గమనించిన సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Big Boss Sunny: బిగ్ బాస్ సన్నీ పై దాడి చేసిన రౌడీ షీటర్.. అలర్ట్ అయిన సిబ్బంది!

ఈ క్రమంలోనే సిబ్బంది అలర్ట్ అవుతూ సన్నీని సురక్షితంగా కారులో పంపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా రౌడీషీటర్ సన్నీ పై దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? ఎవరి ప్రమేయంతోనైనా ఇలా దాడికి ప్రయత్నించాడా అనే విషయాల గురించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆందోళనలో సన్నీ అభిమానులు…

ఈ విధంగా సన్ని పై దాడి చేశారని తెలియడంతో అభిమానులు కొంతమేర ఆందోళన చెందారు. అయితే సన్నీ పై దాడి చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏముంది. ఎందుకు దాడికి ప్రయత్నించారు అంటూ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ విధంగా రౌడీషీటర్ సన్ని పై దాడి చేయడానికి గల కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. కర్రలు, ఇనుప రాడ్‌లతో ఇద్దరు మహిళలపై దాడి..!

ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు 38 ఏళ్ల మహిళపై కర్రలు, ఇనుప రాడ్‌లతో దారుణంగా దాడి చేశారు. అంతే కాదు ఆమె వెంట ఉన్న తన కూతురుపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో గత నెల నవంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు.

దాడి చేసిన వాళ్లు.. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ కి సంబంధించిన వాళ్లు కాబట్టి వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. ఆ రోజు గాయపడిన ఆ ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల వాళ్లు డిశ్చార్జి కాగా దాడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశంలో ఉన్న సీసీటీవీని పరిశీలించారు.

ఇద్దరు మహిళల కారు నుంచి దిగగానే కొంతమంది వచ్చి కర్రలతో తన్నడం, కొట్టడం చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. దాడి సమయంలో అందులో ఓ మహిళ కారు పక్కకు వెళ్లి.. కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ప్రకటనలో పేర్కొంది.

దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటంటే.. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి” అని ఆ మహిళ తెలిపింది. అయితే అవన్నీ నిరాధారణమైనవి అంటూ తన ఆరోపణలను తిప్పి కోట్టారని చెప్పింది. అప్పటి నుంచి నాపై పగ పెంచుకున్నట్లు ఆరోపించింది. ఈ కారణంగానే తనపై దాడి జరిగిందన్నారు.

హీరో సూర్యకి బెదిరింపులు.. అతనిపై దాడి చేస్తే లక్ష రూపాయల బహుమానం..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో పలువురు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం మరికొందరు మాత్రం హీరో దర్శక నిర్మాతలపై విమర్శలు కురిపిస్తున్నారు. జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేశారంటూ జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడు పై చర్యలు తీసుకోవాలని పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసులకి వినతిపత్రం అందించారు.వన్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమానం ప్రకటించారు.

జై భీమ్ చిత్ర నిర్మాత 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని వన్నియార్ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ ఒక వర్గానికి కించపరిచే విధంగా ఈ సినిమాను తీయలేదని ఒక వర్గానికి చెందిన మహిళ ఏ విధంగా న్యాయపోరాటం చేసిన ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

అయితే సూర్యకు బెదిరించడంతో మరికొందరు హీరో సూర్య కు మద్దతుగా నిలబడుతున్నారు. #WeStandWithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు సైతం సూర్యకు మద్దతుగా నిలబడుతున్నారు.

హీరో విజయ్ సేతుపతిని ఎయిర్ పోర్ట్ లో ఎగిరి తన్నిన యువకుడు.. వీడియో వైరల్!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరేదు. ఈయనకు తెలుగులో,తమిళం లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో విజయ్ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ తెలుగులో అతనంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు.

అతన్ని ఎప్పుడెప్పుడు కలుస్తామని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతికి బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఒక చేదు అనుభవం ఎదురైంది. విమానం దిగి వెళుతూ ఉండగా వెనక నుంచి ఒక ఆగంతకుడు వచ్చి విజయ్ సేతుపతి ఎగిరితన్నేందుకు ప్రయత్నించాడు. ఈ ఊహించని సంఘటనతో విజయ్ సేతుపతితో పాటుగా అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయ్ సేతుపతిని క్షేమంగా తీసుకెళ్లారు. అయితే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ సన్నివేశానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ సేతుపతి ఇటీవలే మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నట్లు సమాచారం.

ఇక విజయ్ సేతుపతి పై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఆగంతుకుడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ విషయం పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పునీత్ చనిపోయిన తర్వాత తమిళ హీరోలు స్పందించలేదు,అలాగే నివాళులర్పించడానికి కూడా రాలేదు. తెలుగు హీరోలు వచ్చినా కూడా తమిళ్ హీరోలు తమకేం పట్టనట్టుగా ఉన్నారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు